Saturday, November 23, 2024

మీ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి?

- Advertisement -
- Advertisement -

Minister Harish Rao interacts with Karnataka People

సంగారెడ్డి : రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి టి,హరీశ్ రావు రాష్ట్ర సరిహద్దు కర్ణాటకలోని ఓ గ్రామస్థులతో ముచ్చటించారు. సంగారెడ్డి జిల్లా నారాయణ ఖేడ్ నియోజకవర్గం కర్సిగుత్తిలో గిరిజన బాలికల రెసిడెన్షియల్ పాఠశాల ప్రారంభోత్సవానికి వెళ్తున్న మంత్రి మార్గమధ్యంలో కర్ణాటక రాష్ట్రానికి చెందిన జమిలి గ్రామస్థులు నీళ్ల బిందెలు పట్టుకొని పొలాల వద్దకు వస్తుండటంతో వాహనం దిగి వారి వద్దకు వెళ్లారు. మీ ప్రాంతంలో సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి..? పెన్షన్, రేషన్ సరకులు సమయానికి అందుతున్నాయా..? ఆడ పిల్లల వివాహానికి ప్రభుత్వం నుంచి అందే ఆర్థిక సాయం వంటి తదితర వివరాలను వాకబు చేశారు. అక్కడి స్థానికులు స్పందిస్తూ.. తెలంగాణ రాష్ట్రంలోనే సంక్షేమ పథకాలు బాగున్నాయంటూ వారి సమస్యలను విన్నవించారు. ఈ సందర్భంగా మంత్రి తాగు, సాగు నీరు, విద్యుత్, రైతులకు అందుతున్న సాయంపై మంత్రి హరీష్‌రావు గ్రామస్థులను అడిగి తెలుసుకున్నారు.
మంత్రి : అమ్మా బాగున్నారా…ఎలా ఉన్నారు..? మీది ఏ గ్రామం
మహిళలు : మాది కర్ణాటక రాష్ట్రం బీదర్ జిల్లా గామ తండా వాసులం
మంత్రి : మీ ప్రభుత్వం ఎంత పింఛన్ ఇస్తోంది
మహిళలు :- మా ప్రభుత్వం ఐదు వందల రూపాయలు ఇస్తోంది.
మంత్రి : తెలంగాణ రాష్ట్రంలోని మీ పక్కనే ఉన్న నారాయణఖేడ్‌లో పింఛన్ ఎంత ఇస్తున్నారో తెలుసా..?
మహిళలు- : మా వాళ్లు అక్కడ ఉన్నారు సార్… రెండు వేల రూపాయలు ఇస్తున్నారట.
మంత్రి : విద్యుత్ ఎంత సేపు ఇస్తున్నారు.
రైతు : – ఐదారు గంటలు కూడా రావడం లేదు. అది కూడా వస్తూ పోతూ ఉంటది. నా ఐదెకరాల పంట పొలానికి నీరు పారాలంటే పది రోజులు పడుతుంది సార్.
మంత్రి : పక్కనే నారాయణ ఖేడ్‌లో కరెంటు ఎలా ఉంది.
గ్రామస్థులు- : సార్ పక్కనే తెలంగాణ గ్రామాలలో మాకు కనిపిస్తనే ఉంటుంది. 24 గంటలు కరెంట్ వస్తోంది. మేం చూస్తూనే ఉన్నాం. మా బాధలు తెలుసుకునే వారే లేరు.
మంత్రి : అమ్మా ప్రభుత్వ ఆస్పత్రిలో డెలివరీ సందర్భంగా ప్రభుత్వ సాయం ఏమైనా అందుతుందా..?
మహిళలు : మాకేమీ ఇవ్వడంలేదు.
మంత్రి- : మేం డెలివరీ సందర్భంగా కెసిఆర్ కిట్ అందజేస్తున్నాం.
మహిళలు- : మీ దగ్గర అన్నీ బాగా చేస్తున్నరు సార్.
మంత్రి :- పెళ్లికి ఏమైనా సాయం చేస్తున్నరా ?
మహిళలు- : లేదు సార్.. ఏదీ సాయం అందడం లేదు.
మంత్రి- : నారాయణ ఖేడ్‌లో పెళ్లికి సాయం అందుతుందా..?
మహిళలు- : అందుతుందట సార్, పెళ్లికి లక్ష ఇస్తున్నారట కదా.

Minister Harish Rao interacts with Karnataka People

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News