Saturday, November 23, 2024

ప్రేమ.. అనంతం

- Advertisement -
- Advertisement -

Happy Valentine's Day 2021

ప్రేమ అనంతం.. అపురూపం… ఒకరి మనస్సు ఒకరు మెప్పు కోసం చేసే నిత్య తపస్సు… దీనికి ఆస్తులు, అంతస్థులు, కుల, మత అనే తారమత్యం ఎరుగదు.. ప్రేమను వ్యక్తం చేయడానికి భావాలు తప్ప భాష లేదు… త్యాగం, నిరీక్షణ తప్ప స్వార్థం ఎరుగదు ప్రేమ ఇంతటి ప్రాధాన్యం ఉన్న వాలంటెన్స్ వేడుకలకు నగరం సిద్ధమవుతోంది.

*ప్రేమకు చిహ్నం వాలంటైన్ డే
*నేడు ప్రపంచ వ్యాప్తంగా జరుకునేందుకు యువత సిద్ధం
*విదేశీ సంస్కృతిని దూరంగా ఉండాలని కోరుతున్న హిందుమత సంస్థలు
*నేటి సమాజంలో ప్రేమ యువతీ, యువకుల మధ్య ఆకర్షణే అంటున్న నగర ప్రజలు

హైదరాబాద్: ఇష్టమైన వారికి తమ ప్రేమను వ్యక్తం చేయడానికి వాలంటైన్ డేను అనుకూలమైనదిగా భావిస్తారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రేమికుల దినోత్సవం ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 14న జరుపుకుంటారు. భారత్‌తో పాటు అమెరికా, కెనడా, మెక్సిక్, యునైటేడ్ కింగ్‌డమ్, అస్ట్రేలియా, ఇటలీ, డెన్మార్క్, జపాన్ వంటి దేశాల్లో ప్రేమికులు ఈవేడుకలు ఘనంగా జరుపుకుంటారు. వాలెంటైన్ అనే ఒక ప్రవక్త ప్రేమికుల పుట్టడానికి ఆధ్యుడు. రోమ్ దేశంలో జన్మించిన వాలెంటైన్ యు వతకు ప్రేమ సందేశాలు ఇవ్వడం, ప్రేమ వివాహాలను ప్రోత్సహించడం చేసేవాడు. అదే సమయంలో రోమ్‌ను పాలిస్తున్న చక్రవర్తి క్లాడియస్ కు మార్తె వాలెంటైన్ అభిమానిగా మారడంతో చక్రవర్తికి భయం పట్టుకుంది. దీంతో యువతక ప్రేమ సందేశాలిచ్చి తప్పడు దోవ చూపిస్తున్నాడనే నెపంతో వాలెంటైన్‌కు మరణశిక్ష విధించి పిబ్రవరి 14న ఉరి తీయించాడు. ఈ ఘటన జరిగిన రెండు దశాబ్దాల తరువాత అప్పటి పోప్ గెలాసియన్స్ వాలెంటైన్ మరణించిన రోజును ప్రేమికుల రోజుగా ప్రకటించారు.

అప్పటి నుంచి ఖండాతరాలను దాటుకుని ప్రపంచ వ్యాప్తంగా ప్రేమికులు పండగ జరుపుకోనేలా ప్రేమికుల దినోత్సవం విస్తరించింది. భారతదేశంలో ప్రేమికుల రోజు దినోత్సవం జరుపుకునే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కానీ విదేశీ సంస్కృతి కావడంతో చాలా మంది దీనిని వ్యతిరేకిస్తున్నారు. విదేశాల్లో ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు సెలవు ప్రకటించే విధానం ఉంది. మన దేశంలో ఎలాంటి ప్రత్యేకత ఉండదు. ముస్లింలు అధికంగా ఉన్న దేశాలైన పాకిస్థ్దాన్, సౌదీ అరేబియాలో ఇప్పటి నిషేధం కొనసాగుతోంది. ఇలాంటి సంస్కృతికి దూరంగా ఉండాలని కొన్ని హిందు మత సంస్థలు ప్రచారం చేస్తూ వాలెంటైన్ రోజు ప్రేమజంటలు కనిపిస్తే వారికి వివాహం చేస్తున్నారు. దీని కారణంగా విచ్చలవిడిగా శృంగార, మద్యపానం పెరుగుతుందని ఆరోపిస్తున్నారు.

దీంతో గత ఐదారు ఏళ్లుగా ప్రేమికులు వాలెంటైన్ రోజుబయటకు వెళ్లాలంటే భయపడుతున్నారు. ప్రస్తుతం మనదేశంలో కరోనా వైరస్ ఉండటంతో ప్రేమికులు ప్రియురాలకు ప్రత్యేక బహుమతులు ఇచ్చేందుకు మొగ్గు చూపుతున్నారు. మరో పక్క నగర ప్రజలు ప్రేమికుల మధ్య ఉండాల్సిన ప్రేమ, అవగాహన, నమ్మకం రోజు రోజుకు అవిరైపోతున్నట్లు పేర్కొంటున్నారు. నేటి సమాజంలో ప్రేమికుల మధ్య ప్రేమకంటే ఆకర్షణే కనబడుతోంది. రెండు మనసుల కలయిక ప్రేమ . కానీ అందుకు విరుద్ధంగా కొంతమంది అనాలోచితంగా శారీరక ఆనందానికి ఎక్కువ విలువనిస్తూ భవిష్యత్తు అంధకారంలో పడేసుకున్నట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రకృతి సిద్ధ్దంగా భావజాలాలు, స్పందనలు కలిగిన ఏవి ఎంతవరకు తమ జీవితాలకు ఉపయోగపడుతాయో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు చెప్పాలని హిందుమత సంస్థలు నాయకులు పేర్కొంటున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News