- Advertisement -
హైదరాబాద్: తెలంగాణ ప్రజలకు టిఆర్‌ఎస్ పార్టీ శ్రీరామరక్ష అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. పాటిగడ్డలో టిఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వాన్ని మంత్రి తలసాని ప్రారంభించారు. టిఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వం, విస్తృతంగా జరుగుతోందన్నారు. పార్టీని ముందుకు తీసుకెళ్తున్న కార్యకర్తలు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, లీడర్లకు మనస్ఫూర్తిగా తలసాని అభినందనలు తెలిపారు. కార్యకర్తలతో ప్రజలకు వాలంటీర్‌గా టిఆర్‌ఎస్ మెంబర్ షిప్ తీసుకోవాలని కోరారు. టిఆర్‌ఎస్‌తోనే తెలంగాణలో అభివృద్ధి జరిగిందన్నారు. 70 సంవత్సరాలు తెలంగాణ మోసపోయిందని, టిఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చాక అభివృద్ధి, సంక్షేమ ఫలాలు ప్రజలకు అందుతున్నాయని తలసాని ప్రశంసించారు.
- Advertisement -