- Advertisement -
నిజామాబాద్: బంజారాల అభివృద్ధికి టిఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎంఎల్సి కవిత తెలిపారు. తారాక రమా నగర్లో జరిగిన సేవాలాల్ జయంతి ఉత్సవాల్లో ఎంఎల్సి కవిత పాల్గొన్నారు. ఉత్సవ హోమంలో కవిత పాల్గొన్ని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ప్రతియేటా సేవాలాల్ జయంతి ఉత్సవాలకు ప్రభుత్వం కోటి రూపాయలు మంజూరు చేస్తోందన్నారు. నాగోబా జాతరకు సిఎం కెసిఆర్ కోటి రూపాయలు ప్రకటించారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్ఎ గణేష్ గుప్తా, ఎంఎల్సి విజి గౌడ్ పాల్గొన్నారు.
- Advertisement -