Friday, November 22, 2024

దృష్టి మరల్చి చోరీలు చేస్తున్న గ్యాంగ్ అరెస్టు

- Advertisement -
- Advertisement -

Gang arrested for committing Thefts

 

గ్యాంగ్ లీడర్ రేణుక ఆధ్వర్యంలో చోరీలు
ఆరుగురిని అదుపులోకి తీసుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు
రూ.2.50లక్షల విలువైన వెండి వస్తువులు
ఆటో స్వాధీనం చేసుకున్న పోలీసులు

మనతెలంగాణ, హైదరాబాద్ : జువెల్లరీ షాపుల్లో ఆభరణాలు కొనుగోలు చేసేందుకని వెళ్లి చోరీలు చేస్తున్న ముఠాను నగర టాస్క్‌ఫోర్స్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.2,50,000 విలువైన వెండి పట్టీలు, ఆటో, నాలుగు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. ఎపిలోని ప్రకాశం జిల్లాకు చెందిన యాట రేణుక ఈ గ్యాంగ్‌కు నాయకురాలి ఉంది. మునిపల్లి కిరణ్ ఆటోడ్రైవర్, యాట తులసి, యాట స్వేత, యాట రాజు, ఎలిజబెత్ రాణి కలిసి దొంగతనాలు చేస్తున్నారు. నిందితులు 15ఏళ్ల క్రితం బతుకు దెరువు కోసం నగరానికి వచ్చి రంగారెడ్డి జిల్లా, హయత్ నగర్‌లో ఉంటున్నారు.

అందరిని రేణుక ముఠా ఏర్పాటు చేసింది. ఆటోల్లో తిరుగుతు జూవెల్లరీ షాపుల్లో ఆభరణాలు కొనుగోలు చేస్తామని నమ్మించి అక్కడి వారి దృష్టి మరల్చి బంగారు, వెండి వస్తువులు చోరీ చేస్తున్నారు. తుకారాంగేట్, చిలకలగూడ, నాచారం పోలీస్ స్టేషన్ ఫరిధిలో చోరీలు చేశారు. కేసులు నమోదు చేసుకున్న పోలీసులు 200 నుంచి 250 సిసిటివిల ఫుటేజ్‌ను పరిశీలించి నిందితులను గుర్తించారు. నిందితులు మోండా మార్కెట్ పరిసర ప్రాంతాల్లో ఉన్నట్లు సమాచారం రావడంతో పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఇన్స్‌స్పెక్టర్ నాగేశ్వరరావు, ఎస్సైలు శ్రీకాంత్, రాజశేఖర్ రెడ్డి, పరమేశ్వర్ తదితరులు నిందితులను అరెస్టు చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News