Saturday, November 23, 2024

బాలుడి ప్రాణం తీసిన ఇంకుడు గుంత

- Advertisement -
- Advertisement -

 

భద్రాద్రి కొత్తగూడెం: బాలుడు ఆడుకుంటూ వెళ్లి ఇంకుడు గుంతలో పడి ప్రాణాలు విడిచిన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం గాంధీనగర్ లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. బోడ ప్రసాద్- అరుణ దంపతులకు తన్విష్ (10) అనే కుమారుడు ఉన్నాడు. ఆడుకుంటూ వెళ్లి ఇంకుడు గుంతలో పడ్డాడు. తనయుడు కనిపించకపోవడంతో తల్లి ఇల్లు మొత్తం వెతికింది. ఇంకుడు గుంతలో అపస్మారకస్థితిలో కనిపించడంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు. దీంతో వాళ్ల కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. అప్పటిదాకా ఆడుకున్న కుమారుడులేకపోవడంతో తల్లిదండ్రులు కన్నీంటిపర్యంతమయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News