Friday, November 22, 2024

తొలి సారి మహిళ ఉరికంభం ఎక్కబోతుంది….

- Advertisement -
- Advertisement -

లక్నో: ప్రియుడితో కలిసి తన కుటుంబాన్ని మట్టిలో కలిపిన ప్రియురాలికి సుప్రీంకోర్టు ఉరి శిక్ష విధించింది. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత మహిళకు మొదటి సారి ఉరిశిక్ష పడుతుంది. ఉత్తర ప్రదేశ్ లోని అమ్రోహా ప్రాంతంలో షబ్నమ్ అనే యువతి సలీం అనే యువకుడిని ప్రేమించింది. ఇద్దరు గాఢంగా ప్రేమించుకోవడంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. వీరి ప్రేమపెళ్లికి షబ్నమ్ కుటుంబ సభ్యులు అడ్డుచెప్పడంతో వారిని హత్య చేయాలని ప్రియుడితో కలిసి నిర్ణయం తీసుకుంది. ఇంట్లో ఉన్న ఏడుగురు కుటుంబ సభ్యులను తన ప్రియుడితో కలిసి హత్య చేసింది. ఈ ఘటనలపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణలో ప్రేమ జంట హత్య చేసిందని తేలడంతో వారిని కోర్టు ముందు హాజరుపరిచారు. హైకోర్టు వారికి ఉరి శిక్ష అమలు చేసింది. ఈ కేసును సవాల్ చేస్తూ జంట సుప్రీం కోర్టుకు వెళ్లడంతో అక్కడ కూడా ఉరి శిక్ష సరైందని తీర్పు ఇవ్వడంతో రాష్ట్రపతికి క్షమాబిక్ష పిటిషన్ పెట్టుకున్నారు. పిటషన్ ను రాష్ట్రపతి తిరస్కరించడంతో జైలు అధికారులు ఉరి శిక్షను అమలు చేస్తున్నారు. ఈ జంటను ఉరి తీయడానికి జైలు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఢిల్లీ నిర్భయ కేసులో నిందితులను ఉరి తీసిన పవన్ జల్లానే వీరిని ఉరి తీయనున్నారు. పవన్ రెండు సార్లు జైలుకు వెళ్లి ఉరి తీసే గదిని పరిశీలించారు. ఉరి తీసే తేదీ ఇంకా ఖరారు కాలేదని పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News