మెల్‌బోర్న్: ప్రతిష్టాత్మకమైన ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో టాప్ సీడ్ నొవాక్ జకోవిచ్ (సెర్బియా) ఫైనల్‌కు చేరుకున్నాడు. మహిళల సింగిల్స్‌లో మూడో నవోమి ఒసాకా (జపాన్), జెన్నిఫర్ బ్రాడీ (అమెరికా) టైటిల్ పోరుకు దూసుకెళ్లారు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి సెమీఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ జకోవిచ్ రష్యా ఆటగాడు అస్లాన్ కరాస్తెవ్‌ను ఓడించి ఫైనల్లో ప్రవేశించాడు. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన జకోవిచ్ వరుసగా మూడు సెట్లు గెలిచి టైటిల్ పోరుకు చేరుకున్నాడు. తన మార్క్ షాట్లతో అలరించిన జకోవిచ్ 63, 64, 62తో అస్లాన్‌ను చిత్తు చేశాడు. మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో అమెరికా దిగ్గజం సెరెనా విలియమ్స్‌కు చుక్కెదురైంది. జపాన్ స్టార్ ఒసాకా 63, 64తో సెరెనాను ఓడించి ఫైనల్‌కు చేరింది. మరో సెమీస్‌లో 22వ సీడ్ బ్రాడీ విజయం సాధించింది. కరోలినా ముచోవాతో జరిగిన మ్యాచ్‌లో బ్రాడీ 64, 36, 64తో జయకేతనం ఎగుర వేసి టైటిల్ పోరుకు దూసుకెళ్లింది.
DJocovic enter into Final in Australian Open 2021