Friday, November 22, 2024

ఉపాధి హామీ పథకానికి రూ.139.59 కోట్ల నిధులు విడుదల

- Advertisement -
- Advertisement -

13959 crore released for employment guarantee scheme

హైదరాబాద్ : ఉపాధి హామీ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. రూ. 139 కోట్ల 59 లక్షలను విడుదలకు అనుమతిస్తూ శనివారం పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. ఈనెల 18న ఆర్థిక శాఖ ఇచ్చిన బిఆర్‌ఒకు అనుగుణంగా రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఉపాధిహామీ పథకానికి మొత్తం రూ.1,780.56 కోట్ల ను రాష్ట్ర తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. దీంతో ఈ ఆర్ధిక సంవత్సరం బడ్జెట్‌లో కేటాయింపులు చేసిన మొత్తాన్ని విడుదల చేసినట్లు అయింది.

13959 crore released for employment guarantee scheme

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News