Saturday, November 23, 2024

పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన గుత్తా జ్వాలా

- Advertisement -
- Advertisement -

Gutta Jwala who gave clarity on her Marriage

 

బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి గుత్తా జ్వాలా కోలివుడ్‌ నటుడు విష్ణు విశాల్‌తో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. ఐదు నెలల ముందు ఆమె ఎంగేజ్‌మెంట్‌ సైతం చేసేసుకుంది. దీంతో జ్వాల పెళ్లెప్పుడు అని ఆమె ఫ్యాన్స్‌‌ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆ ఎదురు చూపులకు ఆమె తెరదించారు. ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పెళ్లిపై క్లారిటీ ఇచ్చేశారు. గత కొన్ని నెలలుగా కోలివుడ్‌ నటుడు విష్ణు విశాల్‌ ప్రేమలో ఉన్న గుత్తా జ్వాలా.. ఇటీవల పుట్టిన రోజు సందర్భంగా ఆమె చేతికి రింగ్‌ తొడిగి ఆ ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు జ్వాలా. దీంతో వీరి పెళ్లి వ్యవహారం బయటకు వచ్చింది.

ఇదే విషయంపై ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జ్వాలా స్పష్టత ఇచ్చారు. తాము పెళ్లి చేసుకోబోతున్నామని, అందరికి ఆ న్యూస్‌ అధికారికంగా చెబుతాను అని చెప్పారు. ఇంకా ఆలస్యం చేయాలి అనుకోవడం లేదని క్లారిటీ ఇచ్చారు. కాగా, విష్ణు విశాల్‌పై గుత్తా జ్వాలా ఆసక్తికరమైన కామెంట్స్‌ చేశారు. విష్ణుది తనది ఒకే మనస్తత్వం. ముక్కుసూటిగా ఉండటం వల్లనే తనను కొంతమంది ఇష్టపడకపోవచ్చు. విష్ణు చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు. ఎలాంటి కల్మషం లేని వ్యక్తి. ఇద్దరి భావాలు ఒకేలా ఉండటంతోనే ఒకరికి ఒకరం దగ్గరయ్యాం అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News