ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టులో ఆల్‌రౌండ్‌షోతో అదరగొట్టిన టీమిండియా సీనియర్ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నాడు. ఇప్పటి వరకు జరిగిన రెండు టెస్టుల్లో కలిపి అశ్విన్ 17.82 సగటుతో 17 వికెట్లు పడగొట్టి రెండో టెస్ట్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇందులో అశ్విన్ ఏకంగా రెండుసార్లు 5 వెకెట్లు తీసుకొని రికార్డు సృష్టించాడు. ఇదిలా ఉంటే రవిచంద్రన్ అశ్విన్ ఓ అరుదైన రికార్డుకు అడుగు దూరంలో ఉన్నాడు. 400 వికెట్లు పడగొట్టిన నాలుగో భారత బౌలర్‌గా రికార్డుల్లోకెక్కేందుకు అశ్విన్ మరో 6 వికెట్ల దూరంలో మాత్రమే ఉన్నాడు. దీంతో భారత్-ఇంగ్లాండ్‌ల మధ్య అహ్మదాబాద్‌లోని మొతెరా స్టేడియంలో బుధవారం నుంచి ప్రారంభంకానున్న మూడో మ్యాచ్‌లో అశ్విన్ ఆ రికార్డును తిరగరాస్తాడా లేదా వేచి చూడాలి. 2011లో టెస్టు మ్యాచ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన అశ్విన్ ఇప్పటి 76 టెస్టు మ్యాచుల్లో 394 వికెట్లు తీసుకున్నాడు.