అహ్మదాబాద్: మొతెర స్టేడియం వేదికగా భారత్‌తో జరుగుతున్న డే/నైట్ టెస్టులో ఇంగ్లండ్ జట్టు నాలుగు కీలక వికెట్లు కోల్పోయింది. కెరీర్‌లో వందో టెస్టు ఆడుతున్న పేసర్ ఇషాంత్ శర్మ తన రెండో ఓవర్ లోనే ఇంగ్లండ్ జట్టుకు షాక్ ఇచ్చాడు. ఓపెనర్ డొమినిక్ సిబ్లే(0)ను ఔట్ చేసి భారత్ కు శుభారంభాన్ని అందించాడు. ఆ తర్వాత స్పిన్నర్ అక్షర్ పటేల్ కూడా ఓ చక్కని బంతితో జానీ బెయిర్ స్టో(0)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ జోరూట్(17) కూడా రవిచంద్రన్ అశ్విన్ వేసిన అద్భుత బంతికి పెవిలియన్ కు చేరాడు. దీంతో 74 పరుగులకే ఇంగ్లండ్ మూడు కీలక వికెట్లు కోల్పోయి ఒత్తిడిలో పడింది. అయితే, మరో ఓపెనర్ జాక్ క్రాలే భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. వీలుచిక్కిడప్పుడల్లా బౌండరీలు బాదుతూ స్కోరు వేగాన్ని పెంచే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో అర్థ శతకాన్ని పూర్తి చేసుకున్న జాక్(53)ను అక్షర్ పటేల్ ఔట్ చేశాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ జట్టు 26 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 80 పరుగులు సాధించింది. క్రీజులో బెన్ స్టోక్స్(06), ఒలీ పోప్(0)లు ఉన్నారు.
Eng lost 4 wickets in day/night test against Ind