Friday, October 18, 2024

నాని ‘శ్యామ్ సింగ రాయ్’ లుక్ సూపర్..

- Advertisement -
- Advertisement -

టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని నటిస్తున్న ‘శ్యామ్ సింగ రాయ్’ మూవీ నుంచి అభిమానులకు అదిరిపోయే సర్ ప్రైజ్ వచ్చింది. బుధవారం నాని పుట్టినరోజు సందర్భంగా చిత్రయూనిట్ ఈ సినిమా నుంచి నాని ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసింది. ఇందులో వెనుక నుంచి అమ్మాయి కౌగిలించుకోగా.. కోర మీసాలతో చూస్తున్న నాని లుక్ అదిరిపోయింది. ఈ లుక్ అభిమానులతోపాటు సినీ ప్రేక్షకులు కూడా ఫిదా అవుతున్నారు. పోస్టర్ ను చూస్తుంటే ఈ సినిమా 90ల కాలంలో జరిగే కథగా తెలుస్తోంది. కాగా, ఈ మూవీలో నానికి జోడీగా సాయి పల్లవి, కృతి శెట్టి హీరోయిన్ లుగా నటిస్తున్నారు. ‘టాక్సీవాలా’ మూవీ ఫేం రాహుల్ సంక్రీత్యన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి మిమిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నాడు.

Shyam Singha Roy movie first look released

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News