మెదక్: పాపన్నపేట మండల పరిదిలోని కొత్తపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు మాస్టర్ అవతారమెత్తారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కరోనా అనంతరం పాఠశాల ఎలా నడుస్తుందని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. తెలుగు, లెక్కల సబ్జెక్టులలో విద్యార్థుల ప్రావీణ్యతను పరిశీలించారు. డాక్టర్ కావాలంటే ఏం చదవాలి… డాక్టర్ అయితే అమెరికా వెళ్తావా ఇక్కడ ఉండి ప్రజలకు సేవ చేస్తావా అని విద్యార్థి మనోగతాన్ని అడిగి తెలుసుకున్నారు. పోలీసు అవుతానన్న విద్యార్థితో పోలీసయితే ఏం చేస్తావని ప్రశ్నించారు. మాజీ ప్రధాని పివి నరసింహారావుపై మాట్లాడమని విద్యార్థులను కోరారు. తెలుగు, నుడికారాలు, జాతీయాలు, సామెతలు, సోంత వాక్యాలపై ప్రశ్నలు అడిగారు. కరోనా వల్ల చదువు కోల్పోయారా అని మంత్రి ఆరా తీశారు. మద్యాహ్న బోజన వసతిపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులను బాగా సానబెట్టాలని ఉపాద్యాయులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి, కలెక్టర్ హరీష్, ఎంపీపీ చందనప్రశాంత్రెడ్డి, సర్పంచ్ జగన్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
కొత్తపల్లి జిల్లా పరిషత్ పాఠశాలను సందర్శించిన మంత్రి హరీశ్
- Advertisement -
- Advertisement -
- Advertisement -