అహ్మదాబాద్: నరేంద్ర మోడీ స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్టులో భారత్ తొలి ఇన్నింగ్స్ రెండో రోజు 53.2 ఓవర్లలో 145 పరుగులు చేసి ఆలౌటైంది. భారత జట్టు ప్రస్తుతం 33 పరుగుల ఆధిక్యంలో ఉంది. జోయ్ రూట్ ఆరు ఓవర్లలో ఐదు వికెట్లు తీసి భారత జట్టు నడి విరిచాడు. జాక్ లీచ్ బౌలింగ్ ధాటికి ఓపెనర్లు, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మెన్లు కాక వికలమయ్యారు. రోహిత్ శర్మ హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. భారత బ్యాట్స్‌మెన్లు రోహిత్ శర్మ(66), విరాట్ కోహ్లీ(27), శుభ్‌మన్ గిల్(11), ఇషాంత్ శర్మ(10), అజింక్య రహానే(07), బుమ్రా (01) పరుగులు చేశారు. ఛటేశ్వర పుజారా, వాషింగ్టన్ సుందర్, అక్షర పటేల్ పరుగులేమీ చేయకుండా డకౌట్ రూపంలో ఔటయ్యారు. ఇంగ్లాండ్ బౌలర్లలో జోయ్ రూట్ ఐదు వికెట్లు పడగొట్టగా జాక్ లీచ్ నాలుగు వికెట్లు, జోఫ్రా ఆర్చర్ ఒక వికెట్ తీశాడు. ఇప్పటికే ఇరు జట్లు ఒక్కో మ్యాచ్ గెలిచి 1-1తో సమంగా ఉన్నాయి
భారత్ 145 ఆలౌట్
- Advertisement -
- Advertisement -
- Advertisement -