Saturday, November 23, 2024

హాశిష్ ఆయిల్ తరలిస్తున్న ఇద్దరి అరెస్టు

- Advertisement -
- Advertisement -

Two arrested for moving Hashish oil

 

మూడు లీటర్ల హాశిష్ ఆయిల్, వాహనం, మొబైల్ ఫోన్లు స్వాధీనం

మనతెలంగాణ, హైదరాబాద్ : నిషేధిత హాశిష్ ఆయిల్ తరలిస్తున్న ఇద్దరు నిందితులను ఎల్‌బి నగర్ ఎస్‌ఓటి పోలీసులు గురువారం పట్టుకున్నారు. వారి వద్ద నుంచి మూడు లీటర్ల హాశిష్ ఆయిల్, గూడ్స్ వాహనం, రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వాటి విలువ రూ.15,00,000 ఉంటుంది. పోలీసుల కథనం ప్రకారం….ఎపిలోని వెస్ట్‌గోదావరి జిల్లా, నర్సాపురం టౌన్‌కు చెందిన తోట సంతోష్ కుమార్ డ్రైవర్, కూరగాయలు విక్రయిస్తున్నాడు. కామారెడ్డి జిల్లా, జుక్కల్ మండలం, పడంపల్లి గ్రామానికి చెందిన పౌడే వీరభద్ర కూలీ పనిచేస్తున్నా. ఆయిల్ సరఫరా చేస్తున్న రాజు పరారీలో ఉన్నాడు.

సంతోష్ కుమార్ పదేళ్ల క్రితం బతుకు దెరువు కోసం నగరానికి వచ్చాడు. షాపూర్‌లో ఉంటూ కూరగాయలు, పండ్లు విక్రయిస్తున్నాడు. ఆరు ఏళ్ల తర్వాత కూకట్‌పల్లికి వచ్చి స్థిరపడ్డాడు. సంతోష్ కుమార్ అశోక్ లేల్యాండ్ వాహనం కొనుగోలు చేశాడు. విశాఖపట్టణం నుంచి పండ్లు, కూరగాయలు తీసుకువచ్చి ఇక్కడ విక్రయించేవాడు. ఈ క్రమంలోనే వీరభద్రతో పరిచయం ఏర్పడింది. సంతోష్‌కు రాజుతో పరిచయం ఏర్పడింది. దీంతో అతడి వద్ద హాశిష్ ఆయిల్ కొనుగోలు చేసి నగరానికి తీసుకుని వస్తున్నాడు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో దాడి చేసి పట్టుకున్నారు. రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ పర్యవేక్షణలో ఇన్స్‌స్పెక్టర్ స్వామి, రవికుమార్, ఎస్సైలు సత్యనారాయణ తదితరులు పట్టుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News