మళ్ళీ పెరిగిన గ్యాస్ బండ ధర
నెల రోజుల వ్యవధిలో పెరిగిన రూ.125
రూ.665 నుంచి రూ.846కు చేరిన ధర
నేడు భారత్ బంద్‌కు పిలుపు
నేడు భారత్ బంద్
ధరలను పెరుగుదలను నిరసిస్తూ శుక్రవారం దేశవ్యాప్తంగా వర్తక వాణిజ్య సంస్థ్ధలు ఇచ్చిన భారత్ బంద్‌లో భాగంగా ఉమ్మడి జిల్లా బంద్ జరగనుంది. ఈ బంద్‌కు సిపిఎం, సిపిఐ, న్యూడెమోక్రసి పార్టీలు మద్దతు తెలిపాయి.ఈ బంద్ విజయవంతం కోసం వామపక్షశ్రేణులు కృషి చేయాలని ఆయా పార్టీల జిల్లా కార్యదర్శులు ఒక ప్రకటనను విడుదల చేశారు. రోజు రోజుకు పెరుగుతున్న పెట్రో, గ్యాస్ ధరలను నిరసిస్తూ బంద్‌కు పిలుపునిచ్చారు. బంద్ దృష్టా శుక్రవారం ఖమ్మం వ్యవసాయమార్కెట్‌కు సెలవు ప్రకటించినట్లు మార్కెట్ కమిటీ చైర్మన్ ఒక ప్రకటనలో తెలిపారు.
మన తెలంగాణ/ఖమ్మం ప్రతినిధి: ఒక వైపు పెట్రో ధరలు మంట… మరో వైపు మరో వైపు వంట గ్యాస్ ధర మోత. ఇంకోవైపు అకాశన్నంటుకున్న నిత్యవసర సరుకుల ధరలు సామాన్యుడిపై మోయలేని భారాన్ని మోపుతుండటంతో ఆయా వర్గాలకు దిక్కుతొచని పరిస్థితి నెలకొంది.గడిచిన నెల రోజు ల వ్యవధిలో గ్యాస్ బండపై రూ.100 పెంచి సామాన్యులపై మోయలేని భారం మోపుతున్నారు.
ధనికుల నుంచి సామాన్యుల వరకు ఉపయోగించే గ్యాస్ సిలండర్ ధరను ఈనెలలో ఇప్పటికి 25 రోజుల వ్యవధిలో మూడు పర్యాయాలు రూ.150 వరకు పెంచారు.తాజాగా గురువారం నుంచి కూడా మరో రూ.25 ధరను పెంచారు.ఈనెలలో గ్యాస్ ధరను పెంచడం ఇది నాల్గవ సారి.గృ హ వినియోగదారులు ఉపయోగించే 14.2 కిలోల గ్యాస్ బంధ ధరను ఈనెల 4వ తేదిన రూ.25 పెంచగా ఇదే నెల15న మరో రూ.50,ఈనెల17న మరో రూ.50 పెంచారు.తాజాగా గురువారం మరో రూ.25 పెంచారు. గడిచిన మూడు నెలల వ్యవధిలో ఒక బండపై రూ.225 కు ధర పెరగడంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులకు లోనవుతున్నారు.గత ఏడాది డిసెంబర్ నెలలో ఒకే సారి రూ.100 పెంచిన కేంద్రం ఈ ఫిబ్రవరి నెలలో 25రోజుల వ్యవధిలోనే రూ.125 వరకు పెంచారు.దీంతో 2020 నవంబర్ నెలలో సిలిండర్ ధర రూ.665 ఉండగా 2020 డిసెంబర్‌లో ఒక సిలిండర్ ధర రూ.722కి చేరింది.అదేవిధంగా ఈ ఏడాది జనవరిలో రూ.765,ఫిబ్రవరిలో రూ.846.50కి చేరింది.
గ్యాస్ బండ ధరను పెంచినప్పటికి సబ్సీడిని మాత్రం పెంచకుండా దానిని కూడా తగ్గిస్తూ వస్తుండటంతో వినియోగదారులు భగ్గమంటున్నారు. గతంలో ఒక సిలిండర్‌పై కేంద్ర ప్రభుత్వం రూ.125 సబ్సీడి ఇవ్వగా ఇప్పుడు అది రూ.40, రూ.20కి పడిపోయింది. 2014లో ఒక సిలిండర్ ధర రూ.715 ఉండగా ఇందులో రూ.415 సబ్సీడిగా వినియోగదారుడి అక్కౌంట్లో జమ చేసేవారు. అప్పటి నుంచి గ్యాస్ ధర పెంచుతున్నప్పటికి సబ్సీడిని మాత్రం అంతకు అంతగా తగ్గిస్తూ వస్తున్నారు.
రోజు రోజుకు పెరుగుతున్న గ్యాస్ బండ ధరలు ఉమ్మడి జిల్లాలోని గ్యాస్ వినియోగదారులకు గుదిబండగా మారబోతుంది.ఖమ్మం జిల్లాలో వివిధ కంపెనీలకు చెందిన మొత్తం 32 గ్యాస్ ఏజెన్సీల పరిధిలో 435861 గ్యాస్ కనేక్షన్లు ఉన్నాయి. ఇందులో బిపిసిఎల్ కనేక్షన్లు 97879 ఉండగా, హిచ్‌పి సిఎల్ కనేక్షన్లు 174453, ఐవోసిఎల్ కనేక్షన్లు 163529 ఉన్నాయి.వీటిలో దీపం కనేక్షన్లు 59742 ఉండగా,ప్రధానమంత్రి ఉజ్వల యోజన పధకానికి సంబంధించిన కనేక్షన్లు 47311 ఉన్నాయి. ఇక సింగిల్ కనేక్షన్లు కలిగిని నిరుపేదలకు సంబంధించి 201640 కనేక్షన్లు ఉన్నాయి. ఇక డబుల్ కనేక్షన్లు 78023 వరకు ఉన్నాయి.
అదేవిధంగా భద్రాద్రి జిల్లాలో మూడు కంపెనీలకు సంబంధించి మొత్తం 25 గ్యాస్ ఏజెన్సిల పరిధిలో మొత్తం 352513 కనేక్షన్లు ఉండగా ఇందులో హెచ్ పి సి ఎల్ కనేక్షన్లు 273509 ఉండగా, బిపిసిఎల్ కనేక్షన్లు 29086,ఐఒసిఎల్ కనేక్షన్లు 49918 వరకు ఉన్నాయి. ఇందులో దీపం కనేక్షన్లు 41940, డబుల్ కనేక్షన్లు 52236 ఉన్నాయి.
ప్రతి వినియోగదారుడు ఒక సిలెండర్‌ను సరాసరి రెండు నెలలకోసారి వినియోగిస్తారు. ఇప్పుడు ఒక సిలిండర్ పై రూ.125 వరకు ధరకు పెరిగినందునా ఉమ్మడి జిల్లాలో గ్యాస్ వినియోగదారులపై దాదాపు రూ.10కోట్ల అదనపు భారం పడినట్లయింది. ఏడాదికి రూ.60కోట్ల అదనపు భారం గా మారింది. నెలకోసిలండర్ వాడేపై ఈ బారం రెండింతలుగా పడనుంది.గడిచిన రెండు నెలల వ్యవధిలో రూ.180 అదనపు భారం మోపడంతో ముఖ్యంగా మహిళలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గ్యాస్ ధరలకు తోడుగా పెట్రో ధరలు కూడా రోజు రోజుకు పెంచుతూ రావడంతో సామాన్యలకు సంకట పరిస్థితి ఏర్పడింది.ఇప్పుడు ఒక లీటర్ పెట్రలో సెంచరికి చెరువులో ఉంది. తెలుగు రాష్ట్రాల్లో అది కొద్ది రోజుల్లో లీటర్ పెట్రలో రూ.100కి చేరే స మయం దగ్గరలోనే ఉంది. ఇది చాలదన్నట్లుగా నిత్యవసర సరుకుల ధరలు కూడా చుక్కలను చూపిస్తున్నాయి. వంట నూనే, కందిపప్పు, ఉల్లిగడ్డ ధరలు కూడా అమాంతం పెరిగాయి. అసలే గత ఏడాది పాటు కరోనావైరస్ సంక్షోభంలో చిక్కుకొని ఇప్పుడిప్పుడే కొలుకుంటున్న సామాన్యులపై ధరల బాంబు పెలుతుండటంతో వారిని కొలుకోకుండా చేస్తున్నాయి.