- Advertisement -
మాస్కో: ఇంజన్‌లో సమస్య ఏర్పడడంతో ఒక బోయింగ్ 777 విమానం శుక్రవారం తెల్లవారుజామున మాస్కో విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయినట్లు రష్యా మీడియా తెలియచేసింది. హాంకాంగ్ నుంచి మ్యాడ్రిడ్ వెళుతున్న బోయింగ్ 777 విమానంలో ఎడమ వైపు ఇంజన్‌కు చెందిన కంట్రోల్ చానెల్స్ పనిచేయనట్లు గుర్తించిన పైలట్ విమానాన్ని అత్యవసరంగా మాస్కో విమానాశ్రయంలో ల్యాండింగ్ చేయడానికి అనుమతి కోరినట్లు ఇంటర్ ఫ్యాక్స్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. ఈ విమానంలో ప్రయాణికులతోపాటు కార్కో కూడా ఉందని, అయితే ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారని వార్తా సంస్థ తెలిపింది. కాగా.. యునైటెడ్ ఎయిర్‌లైన్స్ నిర్వహిస్తున్న బోయింగ్ 777 విమానంలోని ఒక ఇంజన్ ముక్కలైపోవడంతో డెన్వెర్‌లో ఈ నెల మొదట్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ జరపాల్సి వచ్చింది.
- Advertisement -