- Advertisement -
27 దేశాలకు కొన్ని మినహాయింపులు
న్యూఢిల్లీ: అంతర్జాతీయ విమానాలపై నిషేధాన్ని మార్చి 31 వరకు కొనసాగించనున్నట్టు పౌరవిమానయానశాఖ డైరెక్టర్ జనరల్(డిజిసిఎ) సర్క్యులర్ జారీ చేశారు. గతంలో ఇచ్చిన నిషేధపు గడువు ఫిబ్రవరి 28తో ముగుస్తున్నందున తాజాగా మరో సర్కులర్ జారీ చేశారు. అయితే, ద్వైపాక్షిక ఒప్పందాలమేరకు ఎంపిక చేసిన 27 దేశాలకు షరతులతో కూడిన మినహాయింపులతో కొన్ని సర్వీసులకు అవకాశమిస్తున్నట్టు ఆ సర్క్యులర్ పేర్కొన్నది. పరిమిత స్థాయిలో విమానాల రాకపోకలకు 27 దేశాలతో భారత్‌కు ఒప్పందాలున్నాయి. వాటిలో బంగ్లాదేశ్, నేపాల్, ఆఫ్ఘనిస్థాన్, అమెరికా, యుకె, యుఎఇ, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, టాంజానియా, ఉక్రెయిన్, కెన్యా, కెనడాలాంటి దేశాలున్నాయి.
- Advertisement -