మన తెలంగాణ/హైదరాబాద్ : గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా తారా ఆర్ట్ అకాడమి అండమాన్‌లో నిర్వహించిన సంస్కృతి కళోత్సవం పోర్ట్ బ్లెయిర్ 2021 సందర్భంగా మొక్కలు నాటారు. రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌కుమార్‌ని సంస్థ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా శనివారం కలిశారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వంటి మంచి కార్యక్రమాన్ని చేపట్టి పర్యావరణ పరిరక్షణ, భావితరాల మనుగడ కోసం కృషి చేస్తున్నారని అభినందించి సంస్థ తరపున సంతోష్‌కు జ్ఞాపికను అందజేశారు. కార్యక్రమంలో సంస్థ చైర్మన్ రాజేష్, రోజా రమణి, నటి డాన్సర్ లీలా రాజ్ (మిథాలీ రాజ్ తల్లి), జూపల్లి మంజులారావు, మేజర్ జయసుధ ఎన్సిసి తదితరులు పాల్గొన్నారు. తమ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమంకు ముందు గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటినందుకు తారా ఆర్ట్ అకాడమీకి జోగినపల్లి సంతోష్‌కుమార్ కృతజ్ఞతలు తెలియజేశారు.
మొక్కలు నాటిన జబర్దస్త్ నవీన్, ప్రొడ్యూసర్ రాజేష్ నాగుల
గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా బతుకమ్మ సినిమా హీరో విజయ్ భాస్కర్ విసిరిన గ్రీన్ ఛాలెంజ్‌ను స్వీకరించి కొంపల్లిలోని హై విజన్ రెసిడెన్సీలో జబర్దస్త్ నవీన్, ప్రొడ్యూసర్ రాజేష్ నాగులలు శనివారం మొక్కలు నాటారు. అనంతరం మాట్లాడుతూ చెట్లు పెంచాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. కాలుష్యాన్ని తగ్గించి అందమైన ఆస్వాదాన్ని పొందవచ్చని తెలిపారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లాంటి బృహత్తర కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటే అవకాశం కల్పించినందుకు రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌కుమార్‌కు జబర్దస్త్ నవీన్, ప్రొడ్యూసర్ రాజేష్ నాగులలు కృతజ్ఞతలు తెలిపారు.