Saturday, November 2, 2024

మొతెరా పిచ్‌పై ఆగని విమర్శలు..

- Advertisement -
- Advertisement -

అహ్మదాబాద్: టీమిండియా-ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగిన మూడో టెస్టులో మొతెరా పిచ్‌పై సోషల్ మీడియా వేదికగా విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటు భారత్ అటు విదేశీ క్రికెటర్లు సయితం మొతెరా పిచ్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఎలాగైన గెలవాలనే లక్ష్యంతో బిసిసిఐ స్పిన్‌కు అనుకూలించే పిచ్‌ను తయారు చేయించుకుందని, ఇది క్రికెట్ నిబంధనలకు విరుద్ధమని భారత మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్, ఆకాశ్ చోప్రా, లక్ష్మణ్, మంజ్రేకర్, హర్భజన్ తదితరులు పేర్కొన్నారు. మొతెరా పిచ్‌పై బ్యాటింగ్ చేయడం చాలా కష్టంగా మారిందన్నాడు. అందువల్లే ఇరు జట్ల బ్యాట్స్‌మెన్‌లు ఘోరంగా విఫలమయ్యారన్నారు. టెస్టు క్రికెట్ రోజురోజుకు ఆదరణ తగ్గుతున్న సమయంలో ఇలాంటి పిచ్‌లను రూపొందిస్తే పరిస్థితి మరింత దయనీయంగా మారడం ఖాయమని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఇంగ్లండ్ మాజీ క్రికెటర్లు కుక్, వాన్, నాసేర్ హుసేన్ తదితరులు కూడా మొతెరా పిచ్‌పై విమర్శలు వర్షం కురిపించారు.

Ex Cricketers Criticise on Motera pitch

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News