కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ
తిరునెల్వేలి: ప్రధాని మోడీ బలమైన శత్రువని, వ్యతిరేకించేవారిని అణచివేసే స్వభావమున్న వ్యక్తి అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ విమర్శించారు. ప్రేమ, అహింసా మార్గంలో ఆయణ్ని రాజకీయ క్షేత్రం నుంచి తెరమరుగు చేయాలని రాహుల్ పిలుపునిచ్చారు. తమిళనాడులో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న రాహుల్ ఆదివారం తిరునెల్వేలిలోని సెయింట్ జేవియర్ కళాశాలలో జరిగిన విద్యావంతుల సమావేశంలో ప్రసంగించారు. కేంద్రంలో బలమైన శక్తిగా ఉన్న బిజెపిని ఓడించడం సాధ్యమేనా అన్న ఓ ప్రేక్షకుడు అడిగిన ప్రశ్నకు రాహుల్ సమాధానమిస్తూ ఆ వ్యాఖ్యలు చేశారు. బ్రిటీష్ సామ్రాజ్యాన్నే దేశ ప్రజలు స్వాతంత్య్ర పోరాటం ద్వారా వెనక్కి పంపించారని, మోడీ అంతకన్నా బలమైన వ్యక్తి ఏమీ కాదని రాహుల్ అన్నారు. దేశ ప్రజలు తలచుకుంటే ఆయణ్ని నాగ్‌పూర్‌కు(ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయం ఉన్నది అక్కడే) పంపించగలరని రాహుల్ అన్నారు.