బీహారీలను కోరిన ఆ పార్టీ నేత తేజస్వీ
కోల్‌కతా: బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో టిఎంసిని గెలిపించాలని ఆర్‌జెడి నేత తేజస్వీయాదవ్ ఆ రాష్ట్రంలోని బీహారీలకు పిలుపునిచ్చారు. అక్కడ ఆర్‌జెడి పోటీ చేస్తుందన్న వార్తల నేపథ్యంలో తేజస్వీయాదవ్ సోమవారం టిఎంసి అధ్యక్షురాలు మమతాబెనర్జీతో భేటీ అయ్యారు. ఈ రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరితే, ఆర్‌జెడికి మమత ఎన్ని సీట్లు ఇస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఇదే అంశమై జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు తేజస్వీ సూటిగా సమాధానాలిచ్చేందుకు నిరాకరించారు. బెంగాల్‌లో బిజెపిని అడ్డుకోవడమే తమ లక్షమని తేజస్వీ అన్నారు. ఆదర్శాలు, విలువల్ని కాపాడేందుకే తమ పోరాటమన్నారు. ఆర్‌జెడి అధినేత లాలూప్రసాద్ యాదవ్, తానూ పరస్పరం ఒకరినొకరం గౌరవించుకునేవారమని మమత గుర్తు చేశారు. తేజస్వీ, తామూ పోరాడుతోంది ఒకరిపైనేనని ఆమె అన్నారు. బీహార్ ఎన్నికల్లో ఎన్‌డిఎకు వ్యతిరేకంగా పోటీ పడ్డ మహాకూటమికి తేజస్వీ నేతృత్వం వహించారు.