Saturday, November 23, 2024

పోలీస్ స్టేషన్ ఎదుట యువతి ఆత్మహత్యాయత్నం

- Advertisement -
- Advertisement -

Young woman commit suicide in Karimnagar

కరీంనగర్: పోలీస్ స్టేషన్ ఎదుట యువతి ఆత్మహత్యాయత్నం చేసుకున్న సంఘటన కరీంనగర్ జిల్లాలోని ఇల్లంతకుంటలో జరిగింది. పిఎస్ ఎదుట నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. శ్రీరాములపల్లి గ్రామానికి చెందిన చిట్యాల సంధ్య, ఎప్పలి పల్లి గ్రామానికి చెందిన అన్నే సంతోష గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. యువతి, యువకుడు కలిసి ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ఇద్దరివి వేరు వేరు కులాలు కావడంతో గ్రామ పెద్దలు అభ్యంతరం చెప్పారు. ప్రేమజంట విడిపోవాలని సూచించడంతో యువతి ఆవేదన వ్యక్తం చేసింది. వెంటనే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తనకు న్యాయం చేయాలని పిఎస్ ఎదుట నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. యువతిని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News