హైదరాబాద్: హైదరాబాద్ కు ఐటిఐఆర్ ను తేలేని జిజెపి రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా ఐటిఐఆర్ ను మూలకు పెట్టింది బిజెపి ప్రభుత్వమేనని కెటిఆర్ స్పష్టం చేశారు. కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ ఈ మేరకు విస్పష్టమైన ప్రకటన చేశారన్నారు. సొంత పార్టీకి చెందిన మంత్రి చేసిన ప్రకటనపై సమాచారం లేకపోవడం బండి సంజయ్ అజ్ఞానానికి నిదర్శనం మంత్రి కెటిఆర్ విమర్శించారు. కేంద్రం, రాష్ట్రంలో బిజెపి అధికారంలో ఉన్నా.. బెంగళూరు లాంటి పట్టణాల్లోనూ ఐటిఐఆర్ ఒక్క అడుగు ముందు పోలేదన్నారు. 2014 నుంచి రాసిన లేఖలు, సమర్పించిన డీటెల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టులన్నీ ఇస్తామన్న కెటిఆర్, బండి సంజయ్‌కు ఐటిఐఆర్ తెచ్చే దమ్ముందా? అని కెటిఆర్ ప్రశ్నించారు. ఐటిఐఆర్ విషయంలో వెనక్కిపోయిన బిజెపి నిరుద్యోగ యువతకు బండి క్షమాపణ చెప్పాలన్నారు. కేవలం మీడియాలో ప్రచారం కోసమే అసత్యాలతో బండి సంజయ్ లేఖ రాశారని మంత్రి పేర్కొన్నారు. ఆయన రాసిన లేఖ ఒక అబద్ధాల జాతరని కెటిఆర్ ఎద్దేవా చేశారు. సిగ్గులేకుండా అసత్యాలు అబద్ధాలను ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే బిజెపి నైజం మరోసారి బయటపడిందని కెటిఆర్ పేర్కొన్నారు.
Minister KTR Fires On BJP Chief Bandi Sanjay