దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసిసి) టీ20 ర్యాంకిగ్స్ జాబితాను బుధవారం ప్రకటించింది. టాప్ 10లో టీమిండియా నుంచి స్టార్ బ్యాట్స్ మెన్లు విరాట్ కోహ్లీ, రాహుల్ లు ఇద్దరికి మాత్రమే చోటు దక్కింది. ఈ జాబితాలో కెఎల్ రాహుల్ 816 పాయింట్లతో రెండో స్థానంలో నిలువగా, కెప్టెన్ విరాట్ కోహ్లి ఒక స్థానాన్ని మెరుగుపరచుకొని 697 పాయింట్లతో 6వ స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్ డేవిడ్ మిలాన్ 915 పాయింట్లతో మొదటి స్థానంలో ఉండగా, పాకిస్థాన్ ఆటగాడు బాబర్ అజమ్ ఒక స్థానాన్ని మెరుగుపర్చుకుని 801 పాయింట్లతో మూడో స్థానంలో, ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ నాలుగో స్థానంలో, దక్షిణాఫ్రికాకు చెందిన వాన్ డెర్ డుసెన్ 700 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచారు. వీరి తర్వాత 6వ స్థానంలో విరాట్ కోహ్లీ ఉన్నాడు.మరోవైపు ఆస్ట్రేలియాతో జరిగిన తొలి రెండు టీ20ల్లో రాణించిన న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ డెవోన్ కాన్వే, మార్టిన్ గప్టిల్ లు తమ స్థానాలను మెరుగుపర్చుకున్నారు. తొలి టీ20లో 99 పరుగులు చేసిన కాన్వే ఏకంగా 46 స్థానాలు ఎగబాకి 17వ స్థానంలో నిలవగా, రెండో టీ20లో 97 పరుగులు చేసిన ఓపెనర్ గప్టిల్ మూడు స్థానాలు ఎగబాకి 11వ ర్యాంకులో నిలిచాడు.
KL Rahul Retained 2nd spot in ICC T20 Rankings 2021