- Advertisement -
జమ్ము : జమ్ముకశ్మీర్ రాజౌరి జిల్లాలో 24 ఏళ్ల ఆర్మీజవాన్ బుధవారం తనకు తాను తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడని అధికారులు తెలిపారు. ఆస్పత్రికి తీసుకువెళ్తుండగా దారిలోనే ప్రాణాలు కోల్పోయాడని తెలిపారు. తనకు తాను కొన్ని తూటాలు పేల్చుకోగా, ఒక తూటా అతని గుండె లోకి దూసుకుపోయిందని రాజౌరి ప్రభుత్వ వైద్యకళాశాల ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జావయిద్ ఇక్బాల్ చౌదరి పాత్రికేయులకు తెలిపారు.
- Advertisement -