Saturday, November 23, 2024

తప్పు చేసిందని తలతో పోలీస్ స్టేషన్ కు…..

- Advertisement -
- Advertisement -

UP man beheads daughter tries take it police station

లక్నో: కూతురు ప్రేమలో పడిందని ఆమెను తండ్రి అతి కిరాతకంగా చంపి అనంతరం మొండెం నుంచి తలను వేరు చేసి పోలీసులు స్టేషన్‌కు వచ్చిన సంఘటన ఉత్తర ప్రదేశ్‌లోని హర్దోయి జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. పండేతారా గ్రామంలో సర్వేశ్ కుమార్ అనే వ్యక్తి నివసిస్తున్నాడు. సర్వేశ్‌కు 17 ఏళ్ల కూతురు ఉంది. కూతురు ఓ వ్యక్తికితో ప్రేమలో పడడంతో పలుమార్లు ఆమెను హెచ్చరించాడు. ఆమె పద్దతి మార్చుకోకపోవడంతో ఆమె తలను నరికాడు. తల పట్టుకొని రోడ్డుపై నడుచుకుంటూ పోలీస్ స్టేషన్‌కు వెళ్తుండగా… స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకొని అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతడిలో కొంచెం కూడా బాధలేదని పోలీసులు వెల్లడించారు. ఇంట్లో తలుపులు బిగించి ఆమెను నరికానని పోలీసులు ఎదుట ఒప్పుకున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి సర్వేష్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News