Saturday, November 23, 2024

ఎంఎల్‌సి అభ్యర్థుల ప్రచారహోరు

- Advertisement -
- Advertisement -

Telangana Graduate MLC Elections 2021

ప్రచారానికి గడువు వారం రోజులే
టిఆర్‌ఎస్ అభ్యర్థి వాణిదేవి గెలుపు కోసం మంత్రులు, ఎమ్మెల్యేలు నగరంలో జోరుగా ప్రచారం
గత పాలనలో చేసిన అభివృద్ధి గురించి చెబుతున్న హస్తం, దేశం అభ్యర్థులు
మోడీతో దేశాభివృద్ధ్ది అని ఊదరగొడుతున్న కమలనాథులు
ఓటర్లకు పోటీ పడి మరీ హామీలు

హైదరాబాద్: గ్రేటర్ నగరంలో పట్టభద్రుల పోరు జో రుగా సాగుతుంది. ఓటర్ల మద్దతు కూడగట్టుకునేందుకు ఆయా పార్టీల నేతలు హామీలు ప్రకటిస్తూ ఈసారి తమను గెలిపిస్తే అభివృద్ధికి చిరునామాగా మారుతామని ప్రసంగాలు ఊదరగొడుతున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ స్థ్దానానికి 93 మంది అభ్యర్థులు బరిలో ఉండటంతో ప్రదాన పార్టీల అభ్యర్థులు ఓట్లు చీల్చుతాయనే భ యంతో ఓటర్లు ప్రత్యర్థుల వైపు మళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎన్నికల ప్రచారానికి గడువు వారం రోజులే ఉండటంతో 5,31,288 మంది ఓటర్ల వద్దకు కరపత్రాలు, సెల్‌ఫోన్ ద్వారా మేసేజ్, కొంత మందిని వ్యక్తిగతం కలుస్తున్నారు. ఓటర్లు ఎక్కువగా గ్రేటర్ పరిధిలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో 4లక్షలకు పైగాఓట్లు ఉండటంతో టిఆర్‌ఎస్, కాంగ్రెస్, బిజెపి, టిడిపి అభ్యర్దులతో స్వతంత్రులు కూడా తామేమి ప్రచారంలో పరుగులు పెడుతున్నారు.

అధికార టిఆర్‌పార్టీ నుంచి మాజీ ప్ర ధాని పివి కూ తురు సురభివాణిదేవి బరిలో ఉండటంతో ఆమె గెలుపు కోసం నగర మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, మహమూద్ అలీ, ఎన్నికల ఇంచార్జీ మంత్రి గంగుల కమలాకర్, హరీష్‌రావు ప్రత్యేక దృష్టి సారించి ఆమె మండలిలో అడుగు పెట్టేలా పట్టభద్రులతో సమావేశాలు నిర్వహిస్తూ ఈసారి గులాబీ పార్టీకి జైకొట్టాలని కోరుతున్నారు. మరోపక్క స్దానిక ఎమ్మెల్యేలు డివిజన్‌లో 50 మంది ఓటర్లకు ఒక పార్టీ కార్యకర్తను ఇంచార్జీగా నియమించి ఓటర్లను రెండు రోజులకోసారి కోసం కలిసి పార్టీకి మద్దతు తెలిపేలా చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ తరుపున మాజీమంత్రి చిన్నారెడ్డి పోటీచేసి విజయం కోసం నియోజకవర్గాల ఇంచార్జీలతో సమావేశాలు ఏర్పాటు చేస్తూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేసిన హస్తం పార్టీ ఆదరించాలని ఓటర్లకు వివరించి మద్దతు పలికేలా చూడాలని కార్యకర్తలకు సూచిస్తున్నారు. టిఆర్‌ఎస్ అభ్యర్థి వాణిదేవికి కాంగ్రెస్ పార్టీలోనే సానూభూతిపరులు ఉన్నారని వారు అటువైపు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు.ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్సీ సభ్యులు బిజెపి తరుపున బరిలో నిలిచిన రాంచందర్‌రావు కూడా ఈసారి ఏలాగైన గెలవాలని శాయశక్తులా కృషి చేస్తున్నారు.

మెజార్టీ ఓట్లు గ్రేటర్ నగరంలో ఉండటంతో ఇక్కడ ఫోకస్ పెడితే మళ్లీ విజయం తనదేనని అంచనా వేస్తూ నగర కార్పొరేటర్లు, కార్యకర్తలతో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేస్తూ కేంద్రంలో బిజెపి అధికారం చేపట్టిన తరువాత అనేక సంక్షేమ కార్యక్రమాలు, ఉద్యోగాల నోటిఫికేషన్ వేసినట్లు పేర్కొంటున్నారు.మరోనేత టిడిపి అభ్యర్దిగా పోటీలో ఉన్న ఎల్.రమణ కూడా గెలుపు కోసం చెమటోడ్చుతున్నాడు. నియోజకవర్గాల స్దాయి సమావేశం నిర్వహిస్తూ కార్యకర్తలు చాలెంజ్‌గా తీసుకుని ప్రతి ఓటరు దగ్గరకు వెళ్లి టిడిపి హయాంలో చేపట్టిన అభివృద్ది, సంక్షేమం, గ్రేటర్ హైదరాబాద్, ఉ మ్మడి పాలమూరులో చేపట్టిన పథకాలు వివరించాలని కోరుతూ ఎన్నికల సమయం తక్కువగా ఉండటంతో ప్రచారానికి ఎక్కువ సమయం కే టాయించాలని కోరుతున్నారు. ఈఎన్నికల్లో పట్టభద్రులు తమ పార్టీకి సహకరిస్తే మండలిలో నిరుద్యోగ, ఉపాధ్యాయ, ఉద్యోగులు సమస్యలపై పోరాడుతానని హామీ ఇస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల రణరంగంలో పోరాడుతు న్న నాయకుల ప్రసంగాలు, ప్రకటించే హామీలు చూసి అధికారం కోసం నాయకులు ఎంతటికైనా దిగుజారుతారని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News