మొతెరా: అహ్మదాబాద్ టెస్టులో ఇంగ్లాండ్ పై భారత్ జయభేరి మోగించింది. ఇంగ్లాండ్ పై ఇన్నింగ్స్ 25 పరుగుల తేడాతో విజయం సాధించి భళా.. భారత్ అనిపించింది. దీంతో నాలుగు టెస్టుల సిరీస్ ను 3-1తో కైవసం చేసుకుంది. ఈ విజయంతో టీమిండియా ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ కి దూసుకెళ్లింది. భారత బౌలర్లు అక్షర్ పటేల్ 5, అశ్విన్,5 వికెట్లు తీసి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించారు. ఈ మ్యాచ్ లోనే కాకుండా ఈ సిరీస్ మొత్తంలో అక్షర్, అశ్విన్ అద్భుతంగా ఆడారు. తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ 205, భారత్ 365 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్ లో భారత్ 160 పరుగుల ఆధిక్యంలో కొనసాగింది. రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లీష్ జట్టు 135 పరుగులకే ఆలౌట్ అయింది. టీమిండియా విజయంలో శతకంతో రిషబ్ పంత్ కీ రోల్ పోషించాడు. వరసగా రెండు సిరీస్ ల్లో తొలి మ్యాచ్ ఓడినా, భారత్ సిరీస్ గెలిచింది. మొదటి మ్యాచ్ ఓడినప్పటికి టీమిండియా 6 సార్లు సిరీస్ గెలిసి సత్తా చాటింది.
India beat England by innings and 25 runs