Saturday, November 23, 2024

ఫైనల్లో విరాట్ సేన

- Advertisement -
- Advertisement -

ముంబయి: ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌ను 3-1తో కైవసం చేసుకున్న టీమిండియా ప్రతిష్టాత్మకమైన ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌కు చేరుకుంది. జూన్ 18 నుంచి ఇంగ్లండ్‌లోని చారిత్రక లార్డ్ మైదానంలో ఈ ఫైనల్ పోరు జరుగనుంది. న్యూజిలాండ్ ఇప్పటికే ఫైనల్ బెర్త్‌ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇంగ్లండ్‌పై భారీ తేడాతో సిరీస్‌ను గెలిచి టీమిండియా పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. చివరి టెస్టులో ఇంగ్లండ్ ఓటమి పాలు కావడంతో ఆస్ట్రేలియా ఫైనల్ ఆశలు గల్లంతయ్యాయి. ఇంగ్లండ్ అంతకుముందే రేసు నుంచి నిష్క్రమించింది. టెస్టు చాంపియన్‌షిప్‌లో మొత్తం 17 టెస్టులు ఆడిన భారత్ 12 మ్యాచుల్లో విజయం సాధించింది. నాలుగింటిలో ఓటమి పాలు కాగా, ఒక టెస్టు డ్రాగా ముగిసింది. టీమిండియా ఓవరాల్‌గా 520 పాయింట్లు సాధించి మొదటి స్థానం సొంతం చేసుకుంది. అంతేగాక 72.2 గెలుపు శాతంతో న్యూజిలాండ్‌ను వెనక్కినెట్టి పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, పాకిస్థాన్ జట్లు టాప్5లో నిలిచాయి.

Team India reached to WTC Final to against ENG

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News