Friday, November 15, 2024

ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

Five members of same family found dead in Durg District

రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ లో విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య చేసుకున్నారు. ఉరేసుకుని ఇద్దరు, మరో ముగ్గురు కాలిన గాయాలతో మృతదేహాలు లభ్యమయ్యాయి. ఈ సంఘటన దుర్గ్ జిల్లాలో చోటుచేసుకుంది. ఘటనాస్థలిలో పోలీసులు సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు. ఆర్థిక ఇబ్బందుల వల్లే ఆత్మహత్యకు పాల్పడినట్టు లేఖలో వెల్లడైంది. మృతులను రామ్ బ్రిజ్ గయాక్వాడ్ (55), అతని భార్య జంకీ బాయి (45), కుమారుడు సంజు గయాక్వాడ్ (24), కుమార్తెలు దుర్గా (28), జ్యోతి (21)లుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ప్రస్తుతం సైబర్ సెల్, డాగ్ స్క్వాడ్, ఫోరెన్సిక్ బృందం సంఘటన స్థలంలో పరిశీలిస్తోంది. పోస్టుమార్టం తరువాత పూర్తివివరాలు తెలుస్తాయని సీనియర్ అధికారి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News