హైదరాబాద్: ఇంతమంది బ్రాహ్మణులను ఒకే వేదికపై చూస్తుంటే జ్ఞాన సరస్వతిని చూస్తున్నట్టు ఉందని మంత్రి కెటిఆర్ తెలిపారు. వాక్ శుద్ధి, చిత్తశుద్ధి ఉన్న నాయకుడు సిఎం కెసిఆర్ అని, బ్రాహ్మణుల కోసం సిఎం కెసిఆర్ సిద్ధిపేటలో ప్రత్యేకంగా బ్రాహ్మణ సదన్ ఏర్పాటు చేశారన్నారు. సిఎం కెసిఆర్ సిద్దిపేట ఎంఎల్‌ఎగా ఉన్నప్పుడే బ్రాహ్మణుల సంక్షేమం కోసం కృషి చేశారని గుర్తు చేశారు. వాణీదేవి నిగర్వి, నిరాడంబరురాలు… గొప్ప విద్యావేత్త అని కెటిఆర్ పొగిడారు. బిజెపి నేతల అసమర్థత వల్లే గ్యాస్, పెట్రోల్, డీజీల్ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయన్నారు. రూ.414 ఉన్న సిలిండర్ ధర రూ. 875కు పెరిగితే బిజెపి నేతలకు గొంతు పెకలిందా? అని ప్రశ్నించారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం కేంద్రం దగ్గర ఎప్పుడైనా బిజెపి నేతల గొంతు పెకలిందా? అని అడిగారు. తెలంగాణలో గిరిజన యూనివర్సిటీ, నవోదయ పాఠశాల ఏర్పాటు కోసం మీ గొంతు పెకలిందా? అని కెటిఆర్ ప్రశ్నించారు. ప్రశ్నించే గొంతునవుతామని బిజెపి నేతలు చెబుతున్నారని, ప్రశ్నించే గొంతు కాదు… పరిష్కరించగలిగే సత్తా, సమన్వయం,సామర్థం కావాలని అడిగారు. పెరుగుతున్న ధరల గురించి కేంద్రం దగ్గర ప్రశ్నించగల సత్తా బిజెపి నేతలకు ఉందా? అని సవాలు విసిరారు. అన్ని అర్హతలు కలిగిన వాణీదేవికి పట్టభద్రులు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలన్నారు.
పెరుగుతున్న ధరలు…. మోడీని ప్రశ్నించండి: కెటిఆర్
- Advertisement -
- Advertisement -
- Advertisement -