చండీగఢ్ః భుజంపై పసిబిడ్డను ఎత్తుకుని ఓ మహిళా ట్రాఫిక్ కానిస్టేబుల్ విధులు నిర్వహిస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. చండీగడ్కు చెందిన ప్రియాంక అనే మహిళా ట్రాఫిక్ కానిస్టేబుల్ గా పనిచేస్తుంది. అయితే, శుక్రవారం విధులకు ఆలస్యంగా రావడమే కాక, తన బిడ్డను తీసుకొని వచ్చింది. దీంతో విధులు నిర్వహించేందుకు వీలుకాకపోతే సెలవు తీసుకోవాలని అధికారులు సూచించారు. అయినా, ఆమె తన బిడ్డను భుజంపై ఎత్తుకుని జో కొడుతూ సెక్టార్ 29 వద్ద రహదారిపై ట్రాఫిక్ విధులు నిర్వహించింది. ఈ దృశ్యాన్ని గమనించిన ఓ వ్యక్తి తన మొబైల్లో వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీంతో ఆ వీడియో బాగా వైరల్ అయ్యింది. దీనిపై స్పందించిన ఓ సీనియర్ అధికారి.. సదరు మహిళా కానిస్టేబుల్ డ్యూటీకి ఆలస్యంగా రావడంతోపాటు పసిబిడ్డతో ట్రాఫిక్ విధులు నిర్వహించడంపై దర్యాప్తు చేయాలని ఆదేశించారు.
మరోవైపు, ఈ వీడియోని చూసిన నెటిజన్లు కొంతమంది మహిళా కానిస్టేబుల్ను ప్రశంసించిగా.. రోడ్డుపై కాలుష్యంతో పిల్లలు అనారోగ్యం బారిన పడతారని, ఎండలో బిడ్డతో విధులు నిర్వహించడం ఏంటని మరికొంతమంది నెటిజన్లు వ్యతిరేకిస్తున్నారు.
on 05.03.21 at 11 am at intersection of Sector 15-23 Chandigarh, Constable Priyanka, who controls the traffic with the baby in her lap. A mother cannot do duty far away from her child. In this regard, the administration is required to change the rules of duty for such mothers. pic.twitter.com/LW3ApAILzl
— Suren (@DelhiCopSuren) March 6, 2021
Chandigarh cop video viral performing duty with newborn