మనతెలంగాణ/హైదరాబాద్ : పనిమనిషిని గదిలో బంధించి రెండు వారాలపాటు లైంగికదాడికి పాల్పడిన నిందితుడు పోనుగోటి ఉదయ్ భాను (52)పై ఆదివారం నాడు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసునమోదైంది. ఈక్రమంలో నిందితున్ని అరెస్ట్ చేసేందుకు పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఇదిలావుండగా గతంలో పలు వివాదాల్లో ఉదయ్ భాను తనకు రాజకీయ నేతలు బంధులంటూ దబాయించాడని పోలీసులు పేర్కొంటున్నారు. అలాగే తనకు ప్రముఖ సినీ నటీ,నటులతో పరిచయాలున్నట్లు పలువురిని బెదిరించాడు. ముఖ్యంగా హెచ్ ఎమ్‌డిఎలో ఒక కాంట్రాక్టు విషయంలో మహిళా ఐ ఏ ఎస్ అధికారిణి కి బెదిరించినట్లు ఫిర్యాదులు వచ్చాయి. కాగా తాజాగా ఉదయ్ భాను తన ఇంట్లో పనిచేసే పనిమనిషి పై అత్యాచారం కేసు నమోదు కావడంతో పరారయ్యాడు. ఈ కేసు విషయంపై పోలీసులు ఉదయ్‌భానుకు ఫోన్ చేస్తే దుర్బాషలు ఆడినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో నిందితుడు ఉదయ్‌భాను ఆచూకీ కోసం బంజారాహిల్స్ పోలీసులు వేటసాగిస్తున్నారు.