- Advertisement -
హైదరాబాద్: అభివృద్ధిలో మహిళలది అత్యంత కీలక పాత్ర అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రశంసించారు. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా లోకానికి సిఎం కెసిఆర్ శుభాకాంక్షలు తెలిపారు. పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో పోటీపడుతూ మహిళలు తమ ప్రతిభను చాటుకుంటున్నారని కొనియాడారు. జనాభాలో సగభాగం ఉన్న మహిళలకు అవకాశాలు ఇస్తే అద్భుతాలు చేసి చూపిస్తారని, మహిళలను అభివృద్ధి పథంలో నడిపించేందుకు తెలంగాణ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందన్నారు. మహిళల భద్రత కోసం షీ టీమ్స్, వృద్ధ మహిళలు, ఒంటరి మహిళలు, వితంతువులకు పెన్షన్లు, కల్యాణ లక్ష్మి, షాదీముబారక్, కెసిఆర్ కిట్, అంగన్వాడీ, ఆశా వర్కర్లకు వేతనాల పెంపు సహా తెలంగాణ ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందన్నారు. మహిళా సంక్షేమంలో తెలంగాణ ముందంజలో ఉందన్నారు.
- Advertisement -