Friday, November 22, 2024

రైతుల నిరసనపై బ్రిటన్ పార్లమెంట్‌లో చర్చ

- Advertisement -
- Advertisement -

Debate in British Parliament on the Farmers' protest

 

భారత్ తీవ్ర నిరసన, హైకమిషనర్‌ను పిలిపించుకుని అసంతృప్తి

న్యూ ఢిల్లీ : భారత్ లో గత కొన్నినెలలుగా వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు తీవ్ర నిరసనలు వ్యక్తం చేస్తుండడం బ్రిటన్ పార్లమెంటులోనూ చర్చకు వచ్చింది. భారత సంతతి పార్లమెంటు సభ్యుడు గుర్చ్ సింగ్ (లిబరల్ డెమొక్రాట్ పార్టీ) దాఖలు చేసిన పిటిషన్ మేరకు బ్రిటన్ పార్లమెంటులో చర్చ చేపట్టారు. లక్షల మంది బ్రిటీష్ ప్రజల సంతకాలతో కూడిన ఆ పిటిషన్ పై దాదాపు గంటన్నర సేపు చర్చించారు. చర్చ సందర్భంగా బ్రిటీష్ ఎంపిలు మోడీ ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టారు. దీనిపై బ్రిటన్‌లో భారత హైకమిషన్, భారత విదేశాంగ శాఖ తీవ్రంగా స్పందించాయి.

మరొక ప్రజాస్వామ్య దేశానికి చెందిన రాజకీయాల్లో పూర్తిగా జోక్యం చేసుకోవడంగానే దీనిని భావిస్తున్నామని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. భారత్‌లో బ్రిటీష్ హైకమిషనర్‌ను పిలిపించుకుని తన అసంతృప్తిని వ్యక్తం చేసింది. అటు, లండన్‌లో భారత హైకమిషన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. వాస్తవాలు తెలుసుకోకుండా చట్టసభల్లో చర్చలు జరపడం ఆమోదయోగ్యం కాదని స్ప్ష్టం చేసింది. ప్రపంచంలోనే భారత్ అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమని, అలాంటి దేశంపై అనుచిత ఆరోపణలు చేయడం, భారత వ్యవస్థలను తప్పుగా చిత్రీకరించడం తగదని పేర్కొంది. భారత్‌లో స్వదేశీ మీడియాతో పాటు బ్రిటీష్ మీడియా సంస్థలు కూడా ఉన్నాయని, మరి భారత్‌లో పత్రికా స్వేచ్ఛ లేదని ఎలా చెప్పగలరని ప్రశ్నించింది. ఈమేరకు భారత హైకమిషన్ మీడియాకు ఓ ప్రకటన విడుదల చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News