Saturday, November 23, 2024

వ్యవసాయం గొప్పదనం చెప్పే కథ

- Advertisement -
- Advertisement -

Sreekaram movie Pre Release event at Khammam

శర్వానంద్ హీరోగా 14 రీల్స్ ప్లస్ పతాకంపై కిషోర్ బి. దర్శకత్వంలో రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మించిన చిత్రం ‘శ్రీకారం’. ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం మహాశివరాత్రి సందర్భంగా గురువారం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఖమ్మంలో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించింది చిత్ర యూనిట్. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేసి ‘శ్రీకారం’ బిగ్ టికెట్‌ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, హీరో శర్వానంద్, హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్, దర్శకుడు కిషోర్.బి, నిర్మాతలు రామ్ ఆచంట, గోపీ ఆచంట, రైటర్ సాయి మాధవ్ బుర్రా తదితరులు పాల్గొన్నారు. ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ “వ్యవసాయం గొప్పదనం చెప్పే కథ ఇది. ఈ సినిమాలో సందేశమే కాదు.. అన్ని రకాల కమర్షియల్ హంగులున్నాయి. నాకు శర్వానంద్ బిడ్డలాంటివాడు.. మరో రామ్‌చరణ్. అతను చాలా సాత్వికుడు. అయితే ‘శంకర్ దాదా ఎంబిబిఎస్’ సినిమాలోని ఓ సాంగ్ సీన్‌లో కుర్రాడు కావాలి. ఎంతో అమాయకంగా కనిపించాలి. శర్వా అయితే బాగా చేస్తాడని అతనితో గెస్ట్ క్యారెక్టర్ చేయించాము. అప్పుడే నాకు అర్థమైంది.. అతను పెద్ద హీరో అవుతాడని. ఆ సీన్ తన నటనకు ఓ మచ్చుతునక అని చెప్పవచ్చు. నాడే శర్వా నటనకు శ్రీకారం పడింది. నటనకు తిలకం దిద్దింది కూడా నేనే. సినిమా సినిమాకు పరిణతి కనిపిస్తూ.. ‘శ్రీకారం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నాడు. ఈ సినిమా సక్సెస్ కాబోతోందని సగర్వంగా చెబుతున్నాను”అని అన్నారు.

హీరో శర్వానంద్ మాట్లాడుతూ “నా మంచి కోరుకునే చిరంజీవి, రామ్‌చరణ్‌లకు నా సినిమాలు ఎప్పుడూ థ్యాంక్స్ చెబుతూనే ఉంటాయి. ఇక ఈ సినిమాలో కావాల్సినంత ప్రేమ, సరిపోయే కామెడీ, సెంటిమెంట్స్, ఏడిపించే విలన్, అన్నం పెట్టే భూమి, నవ్వించే నాన్న, అందమైన అమ్మాయి, వీటి చుట్టూ తిరిగే అబ్బాయి… అన్నీ ఉంటాయి. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే సినిమా ఇది”అని తెలిపారు. నిర్మాత గోపీ ఆచంట మాట్లాడుతూ “వ్యవసాయం చేద్దామని చూసిన ఓ కుర్రాడికి ఎదురైన సమస్యలు, ఎందుకు వ్యవసాయం చేద్దామని అనుకున్నాడని చెప్పేదే ‘శ్రీకారం’. అద్భుతమైన డైలాగ్స్ ఇచ్చారు సాయి మాధవ్ బుర్రా. శర్వానంద్ తన పాత్రను అద్భుతంగా పోషించాడు”అని చెప్పారు. ఈ వేడుకలో డైరెక్టర్ కిషోర్.బి, హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్, సాయి మాధవ్ బుర్రా, పెంచల్ దాస్ తదితరులు పాల్గొన్నారు.

Sreekaram movie Pre Release event at Khammam

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News