Friday, November 1, 2024

రాష్ట్రంలో మరో 189 మందికి వైరస్

- Advertisement -
- Advertisement -

189 New Covid-19 Cases Reported in Telangana

జిహెచ్‌ఎంసి పరిధిలో 34, జిల్లాల్లో 155 పాజిటివ్‌లు
3,00,342కి చేరిన కరోనా బాధితుల సంఖ్య

హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా మరో 189 మందికి వైరస్ సోకింది. వీరిలో జిహెచ్‌ఎంసి పరిధిలో 34 మంది ఉండగా ఆదిలాబాద్‌లో 8, భద్రాద్రి 5, జగిత్యాల 3, జనగాం 2, భూపాలపల్లి 0, గద్వాల 1, కామారెడ్డి 4, కరీంనగర్ 10,ఖమ్మం 7, ఆసిఫాబాద్ 2, మహబూబ్‌నగర్ 5, మహబూబాబాద్ 4, మంచిర్యాల 8, మెదక్ 4, మేడ్చల్ మల్కాజ్‌గిరి 12, ములుగు 0, నాగర్‌కర్నూల్ 1, నల్గొండ 7, నారాయణపేట్ 4, నిర్మల్ 4, నిజామాబాద్ 7, పెద్దపల్లి 4, సిరిసిల్లా 5, రంగారెడ్డి 15, సంగారెడ్డి 6, సిద్ధిపేట 6, సూర్యాపేట్ 1,వికారాబాద్ 5, వనపర్తి 2, వరంగల్ రూరల్ 3, వరంగల్ అర్బన్ 9, యాదాద్రిలో మరోకరికి వైరస్ సోకింది. అంతేగాక వైరస్ దాడిలో మరో ఇద్దరు మరణించారు.

దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 3,00,342కి చేరగా, డిశ్చార్జ్‌ల సంఖ్య 2,96,916కి చేరింది. అయితే ప్రస్తుతం ప్రభుత్వం ఆధీనంలో 16, ప్రైవేట్‌లో 44 కేంద్రాల్లో ఆర్‌టిపిసిఆర్ టెస్టులు నిర్వహిస్తుండగా,1076 సెంటర్లలో యంటీజెన్ టెస్టులు నిర్వహిస్తున్నామని హెల్త్ డైరెక్టర్ డా జి శ్రీనివాసరావు తెలిపారు. మాస్కు, భౌతిక దూరం, శానిటేషన్‌తోనే వైరస్ నుంచి దూరంగా ఉండొచ్చని ఆయన అన్నారు. ముఖ్యంగా జనసమ్మర్ధ ప్రాంతాలు, మార్కెట్లలో అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

189 New Covid-19 Cases Reported in Telangana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News