Friday, November 22, 2024

బోణీ కొట్టేదెవరో?

- Advertisement -
- Advertisement -

బోణీ కొట్టేదెవరో?.. నేడు తొలి టి20
ఆత్మవిశ్వాసంతో భారత్, గెలుపే లక్ష్యంగా ఇంగ్లండ్

IND vs ENG 1st T20 Match on Friday

అహ్మదాబాద్: అభిమానులు ఎంతో అతృతగా ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. ప్రపంచ క్రికెట్‌లోని రెండు అత్యుత్తమ జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల ట్వంటీ20 సిరీస్‌కు శుక్రవారం తెరలేవనుంది. అహ్మదాబాద్‌లోని చారిత్రక మొతెరా మైదానంలో ఇంగ్లండ్‌తో జరిగే తొలి మ్యాచ్‌కు టీమిండియా సమరోత్సాహంతో సిద్ధమైంది. ఇక టెస్టుల్లో ఓడినా ఇంగ్లండ్‌ను తక్కువ అంచన వేయలేం. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ఆటగాళ్లకు జట్టులో కొదవలేదు. ఇయాన్ మోర్గాన్, బెన్‌స్టోక్స్, జాసన్ రాయ్, జోస్ బట్లర్, మోయిన్ అలీ, శామ్ కరన్ వంటి మ్యాచ్ విన్నర్లు జట్టులో ఉన్నారు. ఇక టీమిండియాలో కూడా ప్రతిభావంతులైన క్రికెటర్లకు కొదవలేదు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ఆటగాళ్లు జట్టుకు అందుబాటులో ఉన్నారు. సీనియర్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ చేరికతో బౌలింగ్ కూడా మరింత బలోపేతంగా తయారైంది. టెస్టుల్లో అద్భుతంగా రాణించిన రోహిత్ శర్మ, రిషబ్ పంత్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ టి20ల్లో కూడా చెలరేగాలనే పట్టుదలతో ఉన్నారు. రెండు జట్లలోనూ అగ్రశ్రేణి క్రికెటర్లు ఉండడంతో సిరీస్ ఆసక్తికరంగా సాగడం ఖాయం.
ఓపెనర్లే కీలకం..
ఈ మ్యాచ్‌లో టీమిండియాకు ఓపెనర్లు కీలకంగా మారారు. రోహిత్ శర్మ ఫామ్‌లో ఉండడం టీమిండియాకు కలిసి వచ్చే అంశంగా చెప్పాలి. రోహిత్ టెస్టు సిరీస్‌లో అద్భుతంగా రాణించిన విషయం తెలిసిందే. ఈసారి కూడా అదే జోరును కొనసాగించాలని భావిస్తున్నాడు. అయితే రెండో ఓపెనర్‌గా ఎవరినీ దించాలనేది జట్టుకు ఇబ్బందిగా మారింది. రెండో ఓపెనర్ స్థానం కోసం శిఖర్ ధావన్, కెఎల్.రాహుల్‌ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఇద్దరిలో ఎవరికీ తుది జట్టులో స్థానం లభిస్తుందా అనేది అంతుబట్టకుండా పోయింది. అయితే ధావన్‌తో పోల్చితే రాహుల్‌కే ఓపెనర్‌గా దిగే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి.
కోహ్లి ఈసారైన..
టెస్టు సిరీస్‌లో ఆశించిన స్థాయిలో రాణించడంలో విఫలమైన కెప్టెన్ విరాట్ కోహ్లి ఈసారైన తన బ్యాట్‌కు పని చెబుతాడా లేదా అనేది ఆసక్తిగా మారింది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా కలిగిన కోహ్లి విజృంభిస్తే టీమిండియా బ్యాటింగ్ కష్టాలు చాలా వరకు తీరిపోతాయి. ఇక రిషబ్ పంత్ ఫామ్‌లో ఉండడం భారత్‌కు ఊరటనిచ్చే అంశం. టెస్టు సిరీస్‌లో రిషబ్ ఆకాశమే హద్దుగా చెలరేగి పోయాడు. ఈ సిరీస్‌లో కూడా అలాంటి జోరునే కొనసాగించాలనే పట్టుదలతో ఉన్నాడు. శ్రేయస్ అయ్యర్, సుందర్, అక్షర్‌లు కూడా బ్యాట్‌తో మెరుపులు మెరిపించే సత్తా కలిగిన వారే కావడం జట్టుకు మరింత శుభపరిణామంగా చెప్పాలి. అంతేగాక హార్దిక్ పాండ్య రూపంలో మరో పదునైన అస్త్రం ఉండనే ఉంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా కలిగిన హార్దిక్ చెలరేగితే ఇంగ్లండ్ కష్టాలు రెట్టింపు కావడం ఖాయం. బౌలింగ్‌లోనూ టీమిండియా బలంగానే ఉంది. ప్రతిభావంతులైన బౌలర్లకు జట్టులో కొదవలేదు. ఇలా బ్యాటింగ్, బౌలింగ్‌లలో సమతూకంగా కనిపిస్తున్న భారత్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.
తక్కువ అంచన వేయలేం..
మరోవైపు ఇంగ్లండ్‌ను కూడా తక్కువ అంచన వేయలేం. టెస్టుల్లో ఆడినా జట్టుకు ఇది పూర్తిగా భిన్నమైందని చెప్పాలి. విధ్వంసక ఆటగాళ్ల చేరికతో ఇంగ్లండ్ చాలా బలంగా తయారైంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా కలిగిన బౌలర్లు, బ్యాట్స్‌మెన్‌లకు జట్టులో కొదవలేదు. బట్లర్, మలాన్, జాసన్ రాయ్, స్టోక్స్, మోయిన్, బెయిర్‌స్టో, శామ్ కరన్, మార్క్ వుడ్ వంటి విధ్వంసక బ్యాట్స్‌మెన్ ఇంగ్లండ్‌కు అందుబాటులో ఉన్నారు. బౌలింగ్‌లో కూడా ఇంగ్లీష్ జట్టు చాలా బలంగా ఉంది. దీంతో ఇంగ్లండ్‌ను ఏమాత్రం తక్కువ అంచన వేసినా టీమిండియా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.
జట్ల వివరాలు:
భారత్ (అంచనా): విరాట్ కోహ్లి (కెప్టెన్), రోహిత్ శర్మ, కెఎల్.రాహుల్/ధావన్, శ్రేయస్ అయ్యర్/సూర్యకుమార్, హార్దిక్ పాండ్య, వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్ కుమార్, శార్దూల్ ఠాకూర్/దీపక్ చాహర్, చాహల్, నవ్‌దీప్ సైనీ/అక్షర్ పటేల్.
ఇంగ్లండ్ (అంచనా): జాసన్ రాయ్, జోస్ బట్లర్, డేవిడ్ మలాన్, జానీ బెయిర్‌స్టో, ఇయాన్ మోర్గాన్, బెన్ స్టోక్స్, మోయిన్ అలీ, శామ్ కరన్, క్రిస్ జోర్డాన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్.

రాత్రి 7 గంటల నుంచి స్టార్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం

IND vs ENG 1st T20 Match on Friday

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News