Saturday, November 23, 2024

ఐదు కాలమ్స్‌తో బ్యాలెట్ పేపర్

- Advertisement -
- Advertisement -

ఒక్కో కాలానికి 20 మంది అభ్యర్థుల పేర్లు

 ఎంఎల్‌సి ఎన్నికల్లో అభ్యర్థుల సంఖ్యకు అనుగుణంగా అతిపెద్ద బ్యాలెట్ పేపర్
 జంబో బ్యాలెట్ బాక్సులు సిద్ధం

మనతెలంగాణ/హైదరాబాద్: పట్టభద్రుల ఎంఎల్‌సి ఎన్నికల్లో భారీ సంఖ్యలో స్వతంత్రులు ఉండటంతో ఈసారి బ్యాలెట్ పేపర్ కూడా అతిపెద్దగా ఉండనుంది. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ స్థానం నుంచి మొత్తం 93 మంది, ఖమ్మం-వరంగల్- నల్గొండ స్థానం నుంచి మొత్తం 71 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. బరిలో ఉన్న పోటీదారుల సంఖ్యకు అనుగుణంగా పెద్ద బ్యాలెట్‌ను సిద్ధం చేస్తున్నారు. నాలుగు నుంచి ఐదు కాలాలుగా బ్యాలెట్‌ను విభజిస్తున్నారు. ఒక్కో కాలానికి 20 మంది చొప్పున అభ్యర్థులు ఉంటారు. ఓటు వేసిన అనంతరం కాలం వారీగా బ్యాలెట్ పేపర్‌ను ఫోల్డ్ చేసేలా ముద్రించారు. హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎంఎల్‌సి స్థానానికి 93 మంది అభ్యర్థులు ఉన్న నేపథ్యంలో ఐదు కాలాలుగా బ్యాలెట్ పేపర్‌ను, ఖమ్మం- వరంగల్- నల్గొండ నియోజకవర్గానికి 73 మంది అభ్యర్థులు ఉన్న నేపథ్యంలో నాలుగు కాలాల బ్యాలెట్ పేపర్‌ను సిద్ధం చేశారు. పట్టభద్రుల ఎంఎల్‌సి ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ బారీ ఎత్తున ఉండడంతో దానికి అనుగుణంగా ఎన్నికల అధికారులు జంబో బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేస్తున్నారు.

రెండు నియోజకవర్గాల్లోనూ భారీ సంఖ్యలో అభ్యర్థులు బరిలో ఉండడంతో జంబో బ్యాలెట్ బాక్సులు ఉపయోగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మొత్తం 12 ఉమ్మడి జిల్లాల పరిధిలో ఉన్న పోలింగ్ స్టేషన్లలో ఒక్కో కేంద్రానికి ఒక జంబో బ్యాలెట్ బాక్సుతోపాటు మరో బిగ్ సైజ్ బ్యాలెట్ బాక్సు ఇవ్వనున్నారు. ఈ ఎన్నికల కోసం కోసం కొత్తగా 375 జంబో బ్యాలెట్ బాక్సులు ఏర్పాటు చేశారు. 2010 ఉపఎన్నికల సమయంలో ఎక్కువ మంది అభ్యర్థులు పోటీ చేసిన ఐదు నియోజకవర్గాల కోసం తయారు చేసిన జంబో బాక్సుల్లో 1,310 వినియోగానికి అనువుగా ఉన్నట్లు గుర్తించారు. 1,310 జంబో బాక్సులు పోను త్తగా 375 జంబో బ్యాలెట్ బాక్సులు తయారు చేస్తున్నారు. ప్రస్తుత ఎంఎల్‌సి ఎన్నికల్లో 1,530 పోలింగ్ కేంద్రాలున్నాయి. పది శాతం అదనంగా కలిపి 1,685 బాక్సులను అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు. ఒక్కో పోలింగ్ కేంద్రంలో వెయ్యి మంది ఓటర్ల లోపే ఉన్న నేపథ్యంలో ఒక్కో కేంద్రానికి ఒక జంబో బ్యాలెట్ బాక్సు సరిపోతుందని అంచనా వేస్తున్నారు. ముందు జాగ్రత్తగా జంబో బ్యాలెట్ బాక్సులకు అదనంగా పెద్ద సైజులో ఉండే బ్యాలెట్ బాక్సులను కూడా ఒక్కో పోలింగ్ కేంద్రానికి ఒకటి లేదా రెండు పంపిస్తున్నారు.

5 columns Ballot paper for TS MLC Polls 2021

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News