Sunday, November 17, 2024

వైభవంగా మహా శివరాత్రి ఉత్సవాలు….

- Advertisement -
- Advertisement -

హర హర మహాదేవ
శివాలయాల్లో ఉదయం నుంచే భక్తుల కిటకిట
శివనామస్మరణతో మారుమ్రోగిన ఆలయాలు

Maha shivaratri details in telugu

మన తెలంగాణ/లింగంపేట: మహా శివరాత్రి పర్వదినం పురస్కరించుకొని గురువారం మండలంలోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. హరినామ స్మరణతో శంభో శంకర నినాదంతో ఆలయాలు భక్తి పరవశంతో కళకళలాడాయి. మండలంలో శెట్టిపల్లి సంగారెడ్డి శివాలయం ఉదయం నుంచే భక్తుల తాకిడి ఎక్కవైంది. బానాపూర్ రామాలయం సాయంత్రం భక్తులు ఉపవాస దీక్ష ఉన్నవారు పెద్దఎత్తున తరలివచ్చారు. పోల్కంపేట్ హరిహర గోపాల స్వామి ఆలయం పెద్దఎత్తున భక్తులు తరలివచ్చారు. మోతె రామాలయం, నల్లమడుగు హనుమాన్ ఆలయం, జల్దీపల్లి ముంబాజిపేట్, భవానిపేట్, హనుమాన్ ఆలయం, రామాలయం విద్యుత్ దీపాలతో అలంకరించి భక్తులతో కిటకిటలాడాయి. అయ్యపల్లి ప్రభుస్వామి ఆలయం, మెంగారం శివాలయం శెట్టిపల్లి మల్లికార్జున ఆలయన, లింగంపేట మండల కేంద్రంలోని సాయిబాబా ఆలయం జంబి హనుమాన్ ఆలయం నగరేస్వర ఆలయం రామమందిరం, జోగినాథ్ గుట్ట వినాయక ఆలయం, చిన్నగుడితో పాటు కోమటిపల్లి అల్లు రామాలయం, లింగంపేట పెద్దమ్మ ఆలయం ఆలయ నిర్వాహకులు విద్యుద్దీపాలతో అలంకరించారు. ఉదయం, సాయంత్రం భక్తులు ఉపవాస దీక్షలో ఉన్నవారు పెద్దఎత్తున తరలిరావడంతో ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. రాత్రివేళల్లో ఆలయంలో భజన కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. టెంకాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. శివనామస్మరణతో ఆలయాలు మారుమోగాయి. శంభో హరహర మహాదేవ నినాదాలతో హోరెత్తిపోయాయి.
బోధన్ రూరల్‌లో… మండలం పెంటఖుర్థు గ్రామంలోని మల్లికార్జున స్వామి ఆలయంలో గురువారం మహాశివరాత్రి ని పురస్కరించుకోని మహా శివరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహించారు. పెంటాఖుర్థు గ్రామ పెద్దలు సాయి పటేల్ మరియు క్యాంప్ సర్పంచ్ శ్రీనివాస్ రావు స్వామి వారికి అభిషేకాలు , ప్రత్యేక పూజలు నిర్వహించి ఉత్సవాలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ గ్రామంలో స్వయంభూ జ్యోతిర్లింగాలు 11వ శతాబ్దంలో వెలిసాయని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో పెంటాఖుర్థు గ్రామంలో మరియు వరంగల్ జిల్లాలో మాత్రమే ఈ స్వయంభూ జ్యోతిర్లింగాలు ఉన్నాయని పేర్కోన్నారు. శివపార్వతుల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. నేడు ఆలయంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం ఉందని, భక్తులు స్వామివారి ప్రసాదం స్వీకరించవలసిందిగా కోరారు. ఈ ఉత్సవాలలో భక్తులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గోన్నారు.
నాగిరెడ్డిపేటలో…శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మండలంలోని తాండూర్ గ్రామంలో ఉన్నటువంటి అతి పురాతనమైన ప్రసిద్ధిగాంచిన త్రిలింగేశ్వర ఆలయంలో జడ్పిటిసి ఉమ్మన్నగారి మనోహర్‌రెడ్డి ఆలయంలో శివునికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన ఆలయ కమిటీ సభ్యులతో మాట్లాడుతూ శివరాత్రి పండగ కోసం ఆలయం వద్ద నాలుగు రోజుల పాటు చేయబోయే కార్యక్రమాల వివరాలను అడిగి తెలుసుకోవడం జరిగింది. చేసినటువంటి ఏర్పాటును, సదుపాయాలను, సౌకర్యాలను కూడా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో గాంధారి మండల టిఆర్‌ఎస్ నాయకులు సత్యం రావు, గ్రామ పెద్దలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
బోధన్‌లో… మండల కేంద్రంలోని రాజరాజేశ్వర ఆలయంలో శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. మహా శివరాత్రి పర్వదినాన రుద్రూర్ సిఐ అశోక్ రెడ్డి దంపతులు ఆలయంలో పూజలు నిర్వహించారు. బోధన్ శివాలయం, కోటగిరి , వర్ని తదితర మండలాల్లో మహా శివరాత్రి సందర్భంగా భక్తులతో హోరెత్తిన ఆలయాలు.
ఎడపల్లిలో…మహాశివరాత్రి సందర్భంగా గురువారం మండలంలోని ఎడపల్లి,కుర్నాపల్లి,ఠాణాకలాన్ గ్రామాలలో గల శివాలయాకు భక్తులు ఉదయం నుంచే వచ్చి ప్రత్యేక పూజలు చేసి శివున్ని దర్శించుకున్నారు.శివరాత్రి సందర్భంగా ఆలయాలను కమిటి సభ్యులు, గ్రామస్తులు సుందరంగా ముస్తాబు చేశారు.కుర్నాపల్లిలో గల ఉమామహేశ్వరాలయంలో శివరాత్రి సందర్భంగా జాతర ఉత్సవాలు ఈనెల 15వ తేది వరకు నిర్వహిస్తున్నట్టు ఆలయ ఛైర్మన్ సురేందర్ రెడ్డి తెలిపారు.ప్రత్యేక పూజల్లో ఎడపల్లి తహసీల్దార్ ప్రవీణ్ కుమార్,ఎస్సై ఎల్లాగౌడ్ వారి కుటుంబంతో కలిసి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
బోధన్ టౌన్‌లో…బోధన్ పట్టణంలోని ఏకచక్రేశ్వర శివాలయంలో గురువారం మహా శివరాత్రి పండుగ సందర్భంగా తెల్లవారు జాము నుండే భక్తులు గర్భాలయ ధర్మ దర్శనం , ప్రత్యేక దర్శనం అభిషేక కార్యక్రమాలు నిర్వహించేందుకు భక్తులు బారులు కట్టారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు బోధన్ ఆర్డీవో రాజేశ్వర్ , మున్సిపల్ చైర్మన్ తూము పద్మావతి శరత్ రెడ్డి , బోధన్ పట్టణ సిఐ రామన్ లతో పాటు పట్టణంలోని ప్రముఖ వ్యాపారులు తెరాస , కాంగ్రెస్ ,బిజేపి పార్టీల నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో శివ నామస్మరణతో మార్మోగిపోయింది. మహా శివరాత్రి జాతర పండుగ సందర్భంగా పట్టణం, మండలం లో ని గ్రామాల ప్రజలే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక పరిపర రాష్ట్రాలకు సంబందించినభక్తులు వేల సంఖ్యలో పాల్గోని పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ కమిటి సభ్యులు ఆలయానికి వచ్చె భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. ఆలయానికి వచ్చిన భక్తులు కోవిడ్ నిభందనలు పాటిస్తూ పూజలు నిర్వహించారు.
ఆలయ మహిమ….
శివ లీలామృతము అత్యంత ప్రాచీన సంస్కృత గ్రంథమున ఈ చక్రేశ్వరాలయ ప్రసక్తి కలదు కౌండిన్య మహర్షి శిష్యులతో ఈ దేవాలయం లో వేద ఘోష జరిపెవారని శివలీలీమృతం అనే గ్రంథం లో లిఖించబడినది. కాకతీయ పరిపాలన కాలంలో ముష్కరులు , దక్షిణ దేశ దండయాత్రకు పునుకోవడంతో అతిసుందరమైన దేవాలయంను ముష్కరుల బారి నుండి కాపాడడానికి భూస్థాపితం చేశారని చెప్పుకుంటారు. ఇట్టి దేవాలయ పుష్య బహుళ అమావాస్య రోజున బయల్సడుటచే స్వామి వారి మహత్యం సాక్షాత్కారమైనది. బోధన్ మరియు పరిసర గ్రామల ప్రజలే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక భక్తులకు కూడ కోంగు బంగార మై నిత్య ఆరాద్య దైవమై విరసిల్లుచున్నది. తవ్వకాలలో బయల్పడిన బహాసుందరమైన దేవాలయమే చక్రేశ్వర శివాలయం గుంటూరు వాస్తవ్యాలు శ్రీరామిరెడ్డి బోధన్ లో స్థిరపడడానికి ఓక మట్టి కోటను చదును చేసేందుకు సిద్దపడగా 7 వ తేదీ న ఫిబ్రవరి 1959 ఈ అపురూప దేవాలయం బయటపడింది. ఈట్టి ఆలయంలో ఎంతో మహిమ గల శివలింగం 6.2 అడుగుల ఎత్తుతో ఎంతో చూడ ముచ్చటగ ఉండడం వలన భక్తులు అధిక సంఖ్యలో పాల్గోంటారు. ఈ మహా శివరాత్రి పండుగ జాతరను ఆలయ నిర్వహకులు ఘనంగా నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో శివాలయ చైర్మన్ సింగం భరత్ యాదవ్, మాజీ ఆలయ కమిటి చైర్మన్ పాలావార్ సాయినాథ్, బిజేపి ప్లోర్ లీడర్ మాసిని వినోద్, కమిటి సభ్యులు గుంత గంగాధర్, నాయకులు, బెంజర్ గంగారాం, ఆలయ ప్రధాన అర్చకులు గణేష్ మహరాజ్, అర్చకులు మహెష్ మహరాజ్, ఆలయ ఈవో రామ్ రెడ్డి, సీనియర్ అసిస్టెంట్ రాములు, భక్తులు పాల్గోన్నారు.
బాన్సువాడలో…మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శివాలయాలతో పాటు అన్ని ఆలయాల్లో భక్తుల సందడి నెలకొంది. ముఖ్యంగా శివాలయాల్లో భక్తుల కిటకిట అధికంగా కనబడింది. ఉదయం నుంచే భక్తులు ఆలయాలకు చేరుకుని ఆలయంలో శివ లింగానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉపవాస దీక్షలు చేపట్టిన భక్తులు భక్తి శ్రద్దలతో శివునికి అభిషేకాలు నిర్వహించారు. బాన్సువాడ నియోజకవర్గంలోని ఆయా శివాలయాలు భక్తులతో సందడిగా కనిపించాయి. బాన్సువాడ మండలంలోని సోమేశ్వరాలయం, ఆది బసవేశ్వరాలయంతో పాటు పిట్లం మండలంలోని చిన్న కొడప్‌గల్ సమీపంలోని రామేశ్వరాలయం, బిచ్కుంద శివాలయం, బీర్కూర్ రాజరాజేశ్వరాలయం, జుక్కల్, మద్నూర్, పెద్ద కొడప్‌గల్, నిజాంసాగర్, తదితర మండలాల్లోని శివాలయాలు, తదితర ఆలయాల్లో భక్తులు దర్శనాల కోసం ఉదయం నుంచే క్యూ కట్టారు.
సోమేశ్వరాలయం వద్ద చలివేంద్రం, పండ్ల పంపిణీ…
బాన్సువాడ మండలంలోని సోమ లింగేశ్వరాలయం వద్ద ఆలయానికి విచ్చేసే భక్తుల కోసం శివాజీ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడంతో పాటు ఉపవాస దీక్షలు చేపట్టి దర్శనాల కోసం వచ్చిన భక్తుల కోసం పండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీఆర్‌ఎస్ నియోజకవర్గ నాయకులు పోచారం సురేందర్ రెడ్డి విచ్చేసి చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మొగులయ్య, ఉప సర్పంచ్ గోవింద్, మాజీ ఎంపీటీసీ వీరేశం, శివాజీ యూత్ అధ్యక్షులు సాయిలు, ఉపాధ్యక్షులు రాజశేఖర్, మోహన్, సునీల్ రాథోడ్, స్థానిక యూత్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
* కమనీయంగా రాజరాజేశ్వరుల కళ్యాణం
ఎల్లారెడ్డిలో… మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా గురువారం ఉదయం 4 గంటల నుండే సందడి మొదలయ్యింది. ఆలయాలు పిల్లలతో, పెద్దలతో, భక్తులతో కిటకిటలాడాయి. వాడవాడలా, గ్రామగ్రామాన అంతా శివమయంగా మారిపోయింది. శుక్రవారం మహాశివరాత్రి సందర్భంగా ఉదయం లేస్తూనే ప్రతీ ఒక్కరు తలస్నానం చేసి సాంప్రదాయదుస్తులను ధరించి, పాలాభిషేకాలు, పత్రితో పూజలు, వివిధ రకగాల పండ్లతో నైవేద్యాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక శ్రీ నీలకంఠేశ్వరాలయంలోని స్వామి వారిని పల్లకీ సేవ నిర్వహించి గ్రామంలో ఊరేగించారు. ఈ సందర్భంగా శివభక్తులు చేసిన శివుని దండాలు భక్తులను పరవశింపజేశాయి. యువకులు, మహిళలు పెద్దఎత్తున నీలకంఠేశ్వరాయంలో 108 ప్రదిక్షణలు చేసిన శివుని దండకాలు భక్తులను పరవశింపజేశాయి. యువకులు, మహిళలు పెద్దఎత్తున నీలకంఠేశ్వరాలయంలో 108 ప్రదక్షిణలు చేశారు. అనంతరం ఆలయంలో ఆదిదంపతులైన శివపార్వతుల కళ్యాణాన్ని ఆలయ పూజారులైన సంగప్ప సోదరులు, నీలకంఠప్ప తదితరులు కలిసి వైభవంగా నిర్వహించారు. రాత్రి సహస్రదీపారాధన, అర్ధరాత్రి 12 గంటలకు దింగోద్భవ మహారుద్రాభిషేకం, డోలారోహనం ఉంటుందని ఆలయ పూజారులు తెలిపారు. ఆలయాల వద్ద ఉన్న రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆరోగ్యశాఖ హెల్త్ శిబిరాన్ని, పోలీసు శాఖ బందోబస్తు ఏర్పాటు చేసింది. పట్టణంలోని శ్రీ అయ్యప్పస్వామి ఆలయం, సోమార్‌పేట్ బేస్‌లో కల రాజరాజేశ్వరాలయం, పెద్ద చెరువు కట్ట పై వెలిసిన మహాదేవుని ఆలయాలు ఉదయం నుండే భక్తులతో కిటకిటలాడాయి. మహిళలు పెద్దఎత్తున పూజాసామాగ్రితో, బిల్వపత్రితో, పువ్వులు, పండ్లతో శివాలయాలకు తరలివచ్చి శివలింగానికి అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు.
పిట్లంలో…. పిట్లం మండలంలోని ఆయా శివాలయాల్లో గురువారం భక్తుల సందడి నెలకొంది. ఈ సందర్బంగా ఆలయాల్లోని శివ లింగాలకు ప్రత్యేకంగా అభిషేకాలు, అర్చనలు చేశారు. పిట్లం ఎంపీపీ కవితా విజయ్, సర్పంచ్ విజయ శ్రీనివాస్ రెడ్డి దంపతులు శివాలయాల్లో ప్రత్యేకంగా అభిషేకాలు నిర్వహించారు. ఉదయం నుంచే మండలంలోని ఆయా గ్రామాల భక్తులు ఆలయాలకు చేరుకుని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీంతో ఎటు చూసినా ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి.
పెద్ద కొడప్‌గల్‌లో… పెద్ద కొడప్‌గల్ మండల కేంద్ర సమీపంలోని పాపహరేశ్వరాలయంలో గురువారం భక్తుల సందడి నెలకొంది. ఉదయం నుంచే భక్తులు ఆలయానికి చేరుకుని ఆలయంలో శివునికి అభిషేకాలు నిర్వహించారు. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఎంతో భక్తి శ్రద్దలతో ఉపవాస దీక్షలు చేపట్టిన భక్తులు పూజాది కార్యక్రమాలను నిర్వహించి, శివనామ స్మరణ చేశారు. శివాలయాలతో పాటు ఆయా ఆలయాలు ఉదయం నుంచే భక్తులతో సందడిగా మారాయి. రాత్రికి జాగరణ చేపట్టనున్నట్లు పలువురు భక్తులు పేర్కొన్నారు.
బేగంపూర్ హనుమాన్ ఆలయం వద్ద సప్తాహ…
పెద్ద కొడప్‌గల్ మండలంలోని బేగంపూర్ హనుమాన్ ఆలయం వద్ద గత కొన్ని రోజులుగా సప్తాహ కార్యక్రమం కొనసాగుతుంది. ఆదివారం ప్రారంభమైన సప్తాహలో భాగంగా ప్రతిరోజు ఉదయం నుంచి రాత్రివరకు భజనలు, కీర్తనలు, గాథ పూజ, వీణా వాయిద్యం, హరిపాఠ్, పారాయణం, కాకడ హారతి తదితర భక్తి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. అలాగే ప్ర తిరోజు రాత్రి 9 గం టలకు రోజుకో మహారాజ్‌తో కీ ర్తన చేపట్టి, భ క్తులకు భక్తి మార్గంలో నడవాలని సూచిస్తున్నారు.ఈ కా ర్యక్రమంలో స్థా నిక భక్తులతో పా టు చుట్టూ పక్కల గ్రా మాల భక్తులు, వార్కారీ లు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News