- Advertisement -
పుర్రెకో బుద్ధి.. జిహ్వాకో రుచి అంటారు. ఒక్కొక్కరికి ఒక్కోదానిపై ఆసక్తి ఉంటుంది. జర్మనీకి చెందిన 72 ఏళ్ల వృద్ధుడు పచ్చబొట్లు పొడిపించుకోవడంలో రికార్డులెక్కాడు. ఒక్క అరికాళ్లు తప్ప శరీరం మొత్తం టాటూలు వేయించుకున్నాడు. శరీరంపై 98 శాతం పచ్చబొట్లతో సరికొత్త రికార్డు సృష్టించాడు. ఆ వృద్ధుడి పేరు వోల్ఫ్‌గ్యాంగ్ కిర్ష్. రిటైర్డ్ పోస్టాపీసు ఉద్యోగి. గత రెండు దశాబ్దాలుగా పచ్చబొట్లు పొడిపించుకుంటున్న కిర్ష్ శరీరంపై 86 పెద్దపెద్ద పచ్చబొట్లు ఉన్నాయి. దేశంలో అత్యధికంగా పచ్చబొట్లు పొడిపించుకున్న వ్యక్తిగా అధికారికంగా రికార్డుల్లోకి ఎక్కాడు. 1989లో బెర్లిన్ గోడ కూలిన తర్వాత తాను పచ్చబొట్లు పొడిపించుకోవడం మొదలుపెట్టానని కిర్ష్ చెప్పుకొచ్చాడు. ఇందుకోసం ఏకంగా 720 గంటలు కూర్చోవాల్సి వచ్చిందని వివరించాడు.
72 year old Germany’s record with most tattoos
- Advertisement -