Friday, November 22, 2024

టిఎస్‌పిఎస్‌సి నకిలీ వెబ్‌సైట్

- Advertisement -
- Advertisement -
cyber fake tspsc email id found
సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసిన ముఖ్య కార్యదర్శి వాణీప్రసాద్

హైదరాబాద్: టిఎస్‌పిఎస్‌సి పేరుతో నకిలీ వెబ్‌సైట్‌ను సృష్టించి నిరుద్యోగులను నిండా ముంచాలని చూశారు సైబర్ నేరస్థులు. విషయం తెలుసుకున్న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారులు నగర సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం…. పౌరసరఫరాలు, తెలంగాణ ప్రత్యేక పోలీసు విభాగం, ఇతర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు ఉన్నాయని తెలంగాణ డిజిటల్ మీడియా డైరెక్టర్ విభాగానికి మెయిల్ వచ్చింది. దీంతో వెంటనే స్పందించిన మీడియా విభాగం టిఎస్‌పిఎస్‌సి అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లారు. మెయిల్ tspscgo.in అనే నకిలీ ఈమెయిల్ ఐడి నుంచి మెయిల్ వచ్చినట్లు గుర్తించారు. టిఎస్‌పిఎస్‌సి ముఖ్య కార్యదర్శి వాణీప్రసాద్ నగర సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News