Friday, November 22, 2024

ముగిసిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్

- Advertisement -
- Advertisement -

MLC polling for Telangana graduates is over

హైదరాబాద్: తెలంగాణలో జరుగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఆదివారం సాయంత్రం 4 గంటలకు ముగిసింది. హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్ నగర్, నల్లొండ-ఖమ్మం- వరంగల్ పట్టభద్రుల స్థానాలకు పోలింగ్ జరిగింది. సాయంత్రం 4గంటల లోపు క్యూలైన్ లో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. హైదరాబాద్-రంగారెడ్డి- మహబూబ్ నగర్ స్థానంలో 93 మంది బరిలో ఉన్నారు. నల్గొండ-ఖమ్మం-వరంగల్ స్థానంలో 71 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఈ నెల 17న ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. గతం కంటే ఓటింగ్ శాతం భారీగా పెరిగింది. హైదరాబాద్ లో ఈసారి పోలింగ్ శాతం పెరిగిందని అధికారులు చెబుతున్నారు. గత ఎన్నికల్లో 37.03శాతం ఓటింగ్ నమోదైంది. ఈసారి హైదరాబాద్-రంగారెడ్డి- మహబూబ్ నగర్ స్థానానికి 37.72శాతం ఓటింగ్ నమోదు కాగా, నల్లొండ-ఖమ్మం- వరంగల్ స్థానానికి 54.62శాతం పోలింగ్ నమోదైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News