హైదరాబాద్: గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఓటు వేసి ప్రజాస్వామ్యన్ని గెలిపించండని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జన్ అన్నారు. మాదాపూర్‌లోని పోలింగ్ కేంద్రాలను ఆదివారం ఆయన పరిశీలించారు. డిసిపి వెంకటేశ్వర్లు, ఎసిపి సురేందర్ రావు,ఇన్స్‌స్పెక్టర్ నర్సింగ్‌రావు ఉన్నారు. మాదాపూర్ జోన్లో కూకట్‌పలి, కెపిహెచ్‌బిలోని పోలింగ్ స్టేషన్లను పరిశీలించారు. ఈ సందర్భంగా సిపి విసి సజ్జనార్ మాట్లాడుతూ సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోందని అన్నారు. రంగారెడ్డి, మేడ్చెల్, మల్కాజ్గిరి, హైదరాబాద్ జిల్లాలో అరవై పోలింగ్ లొకేషన్లలో 180 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని తెలిపారు.
ఓటర్లు 1,22,744 ఉన్నారని తెలిపారు. ఓటర్లు ఓటు వేసేందుకు ముందుకు రావాలని కోరారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు ఉన్న ప్రతి గ్రాడ్యుయేట్ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు. ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలని కోరారు. ఎన్ని పనులు ఉన్నా పట్టభద్రులు ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు. ఓట్ ఫస్ట్, వర్క్ నెక్ట్ అన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టంగా బందోబస్తు ఏర్పాట చేశామని తెలిపారు. పోలింగ్ స్టేషన్ల వద్ద ఎలాంటి ఇబ్బందులు ఉన్నా వెంటనే పోలీసుల దృష్టికి తీసుకురావాలని కోరారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ గ్రాడ్యూయేట్లు ఎన్నికల్లో పాల్గొనాలని అన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు తాగునీరు, టెంట్లు, వృద్ధులకు వీల్ చైర్లు తదితర ఏర్పాట్ల పట్ల సిపి సజ్జనార్ సంతృప్తి వ్యక్తం చేశారు.
ఓటింగ్‌లో పాల్గొనాలిః మహేష్ భగవత్, రాచకొండ సిపి
గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవాలని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్‌భగవత్ అన్నారు. పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పోలింగ్ కేంద్రాలను ఆదివారం ఆయన పరిశీలించారు. భువనగిరి, ఎల్బి నగర్‌లోని పోలింగ్ కేంద్రాలను సిపి మహేష్ భగవత్ పరిశీలించారు. పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోందని అన్నారు. ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. ఎలాంటి ఇబ్బంది ఉన్నా వెంటనే పోలీసులకు తెలుపాలని కోరారు. సిపి వెంట భువనగిరి డిసిపి నారాయణరెడ్డి, ఎసిపిలు భుజంగరావు, నర్సింహారెడ్డి, పురుషోత్తం రెడ్డి, తదితరులు ఉన్నారు.