Saturday, November 16, 2024

ఎపిలో కొత్తగా 147 పాజిటివ్ కేసులు.. ఒకరు మృతి

- Advertisement -
- Advertisement -

147 New Corona Cases Registered in AP

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో గడిచిన 24 గంటలలో 22,604మందికి పరీక్షలు చేయగా, కొత్తగా 147 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇక, కరోనా వైరస్ కారణంగా రాష్ట్రంలో మరో వ్యక్తి చనిపోయినట్లు తెలిపింది. దీంతో రాష్ట్రంలో మొత్తం 8 లక్షల 92వేలకు పైగా కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు కరోనాతో మృతి చెందిన వారిసంఖ్య 7,185కు చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,443 కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. ఇప్పవటివరకు రాష్ట్రవ్యాప్తంగా 8లక్షల 83 వేలకు పైగా కరోనా బాధితులు కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 1,45,57,366 శాంపిళ్లను పరీక్షించినట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు.

147 New Corona Cases Registered in AP

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News