Monday, November 11, 2024

విడాకులు వద్దు… భార్య కాళ్లు పట్టుకున్న భర్త

- Advertisement -
- Advertisement -

Husband hold wife legs over divorce

లక్నో: భార్యభర్తల మధ్య దాదాపుగా వివాహేతర సంబంధాలు ఉండడంతో విడాకుల కోసం వారు కోర్టు మెట్లు ఎక్కుతున్నారు. విడాకులు వద్దని భార్య కాళ్లు పట్టుకొని భర్త బతిమలాడిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం అలీఘఢ్ ప్రాంతం టప్పర్‌లో జరిగింది. కొన్ని సంవత్సరాల క్రితం యువతి, యువకుడికి పెళ్లి జరిగింది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అన్యోన్యంగా ఉండే దంపతులకు మధ్యలో ఓ కుర్రాడు వచ్చాడు. కుర్రాడితో వివాహిత పరిచయం పెంచుకుంది. పరిచయం ఇద్దరు మధ్య వివాహేతర సంబంధానికి దారితీసింది. దీంతో భర్తతో విడాకులు కావాలని భార్య కోర్టు మెట్లు ఎక్కింది. ఇద్దరు కోర్టు వచ్చినప్పుడు విడాకులు తీసుకోవద్దని పిల్లలు భవష్యత్ అంధకారమవుతుందని భార్యకు భర్త తెలపడంతో పాటు ఆమె కాళ్లు పట్టుకున్నాడు. కానీ ఆమె పట్టించుకోకుండా ప్రియుడు బైక్‌పై వెళ్లిపోయింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News