- Advertisement -
నార్సింగ్: రంగారెడ్డి జిల్లా నార్సింగ్ పరిధిలోని నెక్నంపూర్ లో మంగళవారం దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తన భార్యను చంపి తాను ఆత్మహత్య చేసుకున్నాడు. మృతులను కృష్ణకుమారి, రమణలుగా గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. కుటుంబకలహాల వల్లే ఈ దారుణానికి పాల్పడినట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సిఉంది.
husband commits suicide by killing wife in ranga reddy
- Advertisement -