- Advertisement -
వీధిలైట్లు, సిసిటివిల కోసం ప్రభుత్వం నిధుల పెంపు
లండన్ :మహిళలు, బాలికలకు దుండగుల నుంచి ఎలాంటి ఆపద కలగకుండా రక్షించడానికి వీలుగా వీధి దీపాలకు, సిసిటివి కెమెరాలు, టివిల ఏర్పాటు కోసం నిధులు పెంచడానికి బ్రిటన్ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈనెల మొదట్లో దక్షిణ లండన్ వీధుల్లో 33 ఏళ్ల సారా ఎవెరార్డ్ అనే యువతిని కిడ్నాప్ చేయడమేకాక హత్యచేయడం పై బ్రిటన్ దేశమంతా ఆందోళనలు చెలరేగాయి. దీనిపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. మహిళల భద్రతకు కావలసిన ఏర్పాట్ల కోసం 45 మిలియన్ పౌండ్లవరకు నిధులు పెంచనున్నట్టు ప్రధాని బోరిస్ జాన్సన్ సోమవారం రాత్రి వెల్లడించారు. ఈమేరకు పైలట్ ప్రాజెక్టును విస్తరించడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. సాదాసీదా దుస్తులతో పోలీస్ అధికార్లు బార్లు, నైట్ క్లబ్బులు ఉండే ప్రాంతాల్లో నిఘా ఉండేలా ప్రణాళికలు రూపొందించింది.
- Advertisement -